Home

»

Latest News

Peddi: పుష్ప 2 దారిలో పెద్ది 

May 9, 2026 10:17AM

 


-శరవేగంగా ముస్తాబవుతున్న పెద్ది 
-సరికొత్త రికార్డులు పెద్దిపై నమోదు కాబోతున్నాయా!
-పుష్ప 2 ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఏంటి!


పాన్ ఇండియా వ్యాప్తంగా సరికొత్త రికార్డులు సాధించడమే లక్ష్యంగా 'పెద్ది'(Peddi)శరవేగంగా ముస్తాబవుతున్నాడు. ఇటీవల ఓవర్ సీస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్  ఓపెన్ చేస్తే నమోదైన రికార్డులే అందుకు సాక్ష్యం. మరి యుఎస్ లోనే ఆ విధంగా ఉంటే తెలుగు రాష్ట్రాల మానియా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు . మేకర్స్ కూడా సదరు మానియా కి తగ్గట్టుగానే ముందుకెళ్తూ సరికొత్త రికార్డులు పెద్దిపై ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం 'పెద్ది' ట్రైలర్ వేడుకని ఉత్తర భారతదేశంలో అత్యంత భారీ స్థాయిలో నిర్వహించేందుకు టీం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సాధారణంగా మన సినిమా ఈవెంట్లు హైదరాబాద్ లోనే జరుగుతుంటాయి. కానీ పుష్ప 2 లాగా అక్కడి ప్రేక్షకులని పెద్ది వైపు టర్న్ చేసేలా ముంబై లేదా ఢిల్లీలో ఒక భారీ ఈవెంట్‌ని నిర్వహించాలని మేకర్స్ చూస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి బాలీవుడ్ అగ్ర నటులని గెస్ట్ లుగా ఆహ్వానించే అవకాశం ఉందని, దీని ద్వారా పెద్దికి  నేషనల్ వైడ్ పబ్లిసిటీ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారంట. 'పెద్ది' కేవలం ఒక ప్రాంతీయ కథగా కాకుండా, అందరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ పాయింట్‌తో తెరకెక్కింది. పైగా కుస్తీ,క్రికెట్ కి నార్త్ లో ఆదరణ ఎంతో ఉంటుంది.


Also read: Godari Gattupaina: గోదారి గట్టుపైన ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా!.. దీన్ని బట్టి రేంజ్ అర్ధం చేసుకోవచ్చు 

ఈ నేపథ్యంలో పెద్ది ని నార్త్ లో సరైన విధంగా ప్లాన్ చేస్తే, కానీ విని ఎరుగని రికార్డులు పెద్దికి దక్కుతాయి. పుష్ప 2 విషయంలో కూడా నార్త్  ప్రమోషన్ స్ట్రాటజీ పక్కాగా ఉండటంతో రికార్డు కలెక్షన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఒకప్పుడు మన  సినిమాలు హిందీలోకి డబ్ అయ్యి యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించేవి. కానీ ఇప్పుడు నేరుగా థియేటర్లలోనే బాలీవుడ్ సినిమాలకి గట్టి పోటీ ఇస్తున్నాయి. 'పెద్ది'  మేకర్స్ అనుసరిస్తున్న ప్రమోషన్ స్ట్రాటజీ సక్సెస్ అయితే,  ఓపెనింగ్స్ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ ఈవెంట్ తేదీ మరియు వేదికపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

  
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com