Home

»

Latest News

Peddi: ఆ ఏరియాలో పుష్ప 2 , దేవర కలెక్షన్స్ ని దాటలేకపోయిన పెద్ది 

Jun 5, 2026 3:09PM

 

 

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో 'పెద్ది'(Peddi)బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 135.36 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లని రాబట్టి  సరికొత్త సంచలనం సృష్టించింది. దాదాపుగా అన్ని ఏరియాల్లోను రికార్డు కలెక్షన్స్ సృష్టించింది. 

 అయితే, మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రాయలసీమ (సీడెడ్) రీజియన్‌లో మాత్రం మిగతా ఏరియాలతో పోలిస్తే కాస్త భిన్నమైన ఫలితాన్ని అందుకుంది. అయినప్పటికీ ఓవరాల్‌గా ఆల్‌టైమ్ టాప్ రికార్డుల లిస్ట్‌లో ఒక అద్భుతమైన స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. రాయలసీమ ఏరియాలో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల ఆల్‌టైమ్ జాబితాలో 'పెద్ది' 7.70 కోట్ల షేర్ వసూళ్లతో టాప్ 4వ స్థానంలో నిలిచింది. ఈ భారీ కలెక్షన్లతో చరణ్ మరోసారి రాయలసీమ బాక్సాఫీస్ వద్ద తన అసలైన స్టామినాని  నిరూపించుకున్నాడు. కానీ, ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా రాయలసీమలో సరికొత్త రికార్డులను తిరగరాస్తుందని భావించినప్పటికీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' రికార్డుని, పుష్ప 2 రికార్డుని  మాత్రం బ్రేక్ చేయలేకపోయింది.

సీడెడ్ డే-1 కలెక్షన్ల చార్ట్‌లో  'పుష్ప 2: ది రూల్' రూ. 12.15 కోట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా సంచలనం సృష్టించిన 'దేవర: పార్ట్ 1' చిత్రం రూ. 10.40 కోట్ల వసూళ్లతో ఆల్‌టైమ్ టాప్ 3వ స్థానాన్ని భద్రపరుచుకుంది. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' చిత్రం రూ. 7.70 కోట్లు సాధించి నాల్గవ స్థానాన్ని ఆక్రమించింది. దేవర సినిమా కంటే సుమారు రెండున్నర కోట్ల రూపాయలు తక్కువ వసూలు చేయడంతో సీడెడ్ ఏరియాలో దేవర రికార్డుని పెద్ది అధిగమించలేకపోయింది.  RRR' 17 కోట్లతో మొదటి స్థానంలో ఉంది.

also read: ఈ రోజు ఓటిటిలో ఇరవై పవర్ ఫుల్ సినిమాలు.. ఆ చిత్రం ఎలాంటి కట్స్ లేకుండానే 

ఏది ఏమైనప్పటికీ, ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఉన్న చిత్రానికి రాయలసీమ లాంటి పక్కా మాస్ బెల్ట్‌లో మొదటి రోజే  7.70 కోట్ల షేర్ రావడం అంటే మామూలు విషయం కాదు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ సుమారు 250 నుంచి 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన పెద్దికి  మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com