
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల సోషల్ మీడియాకు దూరమయ్యారు. కొన్ని నెలల క్రితమే ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టి, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు, విశేషాలను అభిమానులతో పంచుకున్న ఆమె.. ఇప్పుడు అకస్మాత్తుగా తన ఖాతాను డీయాక్టివేట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అసలు అన్నా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలే కారణమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
పవన్ చాలాకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నప్పటికీ.. అన్నా కొణిదెల మాత్రం వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా ప్రైవేట్‌గానే ఉంచేవారు. అయితే 2026 మార్చిలో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పవన్ తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. అన్నా సోషల్ మీడియాలోకి రావడంపై మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత కుటుంబానికి సంబంధించిన ఫొటోలు, వ్యక్తిగత విశేషాలను ఆమె పంచుకున్నారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చారు. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై ఆసక్తి పెరిగింది. కానీ ఇప్పుడు అకౌంట్ డీయాక్టివేట్ కావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

అన్నా కొణిదెల ఇన్‌స్టాగ్రామ్ నుంచి తప్పుకోవడానికి సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్లు కారణమై ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. పవన్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. ఆయనపై జరిగే రాజకీయ విమర్శలు కొన్నిసార్లు కుటుంబ సభ్యుల వరకు కూడా వెళ్తుంటాయి. ఈ క్రమంలో అన్నా కూడా ఆన్‌లైన్‌లో విమర్శలను ఎదుర్కొన్నారనే కథనాలు వస్తున్నాయి.
అయితే ఆమె ఖాతాను ఎందుకు డీయాక్టివేట్ చేశారనే విషయంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి వివరణ రాలేదు. కాబట్టి నెగిటివ్ కామెంట్ల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని నిర్ధారించలేం. వ్యక్తిగత కారణాలతోనైనా ఆమె సోషల్ మీడియాకు విరామం ఇచ్చి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
అయితే ఇది తాత్కాలిక విరామమా? లేక అన్నా కొణిదెల ఇకపై సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: కొమ్మూరి సాంబశివరావు శత జయంతి.. ఇందిరా గాంధీ హత్యను ముందే ఊహించిన రచయిత.!
[Pawan Kalyan Wife Instagram Deactivated, Anna Konidela Instagram Deactivated, Anna Konidela Instagram, Pawan Kalyan, Anna Konidela, Instagram, Telugu Film News]






