Home

»

Latest News

Balakrishna: ఈ రోజు బాలకృష్ణ బర్త్ డే..పవన్ కళ్యాణ్ ట్వీట్ వైరల్ 

Jun 10, 2026 11:21AM

 

 

ఈ రోజు ఆంధ్రా అందగాడు, బాక్స్ ఆఫీస్ బొనాంజా, యువరత్న,నటసింహ, గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్, హిందూపురం ఏంఎల్ఏ బాలకృష్ణ పుట్టినరోజు. అభిమానులకి పండుగరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమాల వేదికగా బాలకృష్ణకి  హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 


తన ట్వీట్ లో 'వెండితెరపై పవర్‌ఫుల్ నటనతో అలరిస్తూ, రాజకీయాల్లో హిందూపురం నియోజకవర్గం నుండి వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందుతూ ప్రజాసేవలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా తన మాతృమూర్తి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్‌గా ఉంటూ, వేలాది మంది పేద క్యాన్సర్ రోగులకి  ఉచితంగా, రాయితీలతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ ఆపన్నహస్తంగా నిలవడం అభినందనీయం. సినిమాలకే పరిమితం కాకుండా నిజజీవితంలోనూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన బాలయ్య బాబు, రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నానని తెలిపాడు. ఇప్పుడు ఈ ట్వీట్ ఇరువురి అభిమానులని అలరిస్తుంది.

Also read: Peddi: నష్టాల దిశగా నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకు మించి? 



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com