Home

»

Latest News

పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నాడు! తెలంగాణ ఫ్యాన్స్ ఏమంటున్నారు

Dec 03, 2025

 

 

-ఫ్యాన్స్ ఏమంటున్నారు!
-పవన్ ఏం చెప్పబోతున్నాడు!
-అధికార పార్టీ ఏమంటుంది!

 

 

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)ఇటీవల ఆంధ్రప్రదేశ్(Andrapradesh)డిప్యూటీ సిఎం హోదాలో బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లిలో మాట్లాడుతు తెలంగాణ(Telangana)నేతలు గోదావరి జిల్లాల్లోపచ్చదనం బాగుంటుందని అనేవారని ఇప్పుడు కోనసీమలోకి కొబ్బరి చెట్లకి వాళ్ళ దిష్టితగిలినట్లు ఉందని మాట్లాడారు. దీంతో తెలంగాణాకి చెందిన పలువురు నేతలు పవన్ వ్యాఖ్యలపై మండి పడుతున్నారు.

 

 

అధికార కాంగ్రెస్ నాయకులైతే తెలంగాణ ప్రజలకి పవన్ క్షమాపణ చెప్పాలని లేదంటే పవన్ సినిమాలని తెలంగాణాలో ఆడనివ్వమని ఖరాకండిగా చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో తన మాటలపై పూర్తి వివరణ ఇవ్వలేదు.ఒక వేళ మాట్లాడితే  తెలంగాణ బావ జాలం తన ఎదుగుదలకి ఉపయోగపడిందని చెప్పే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడనే ఆసక్తి అందరిలో  ఉంది. 

 

 

 also Read:   తెలంగాణాలో అఖండ 2 టికెట్ రేట్స్ ఇవేనా!

 

జనసేన పార్టీ నుంచి మాత్రం పవన్ వ్యాఖ్యలని వక్రీకరిస్తున్నారని అధికారకంగా ఒక లెటర్ విడుదలైంది. తెలంగాణకి చెందిన జనసేన నాయకులతో పాటు పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతు పవన్ మాటలని కావాలని కొంతమంది వక్రీకరిస్తున్నారు. తెలంగాణ ప్రాంతాన్ని,ప్రజలని పవన్ అవమానించలేదు. కొంత మంది నాయకులు తమ రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడానికి ఈ విషయాన్నీ రాద్ధాంతం చేస్తున్నారని మాట్లాడుతున్నారు.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com