.webp)
తిరువీర్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం 'ఓ సుకుమారి' (Oh Sukumari). ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.
'ఓ సుకుమారి' చిత్రాన్ని జూలై 17, 2026 న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఒక ఎలెక్ట్రిఫైయింగ్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇందులో హీరోయిన్ ని హీరో ముట్టుకుంటే షాక్ కొడుతుంది, అలాంటిది ఈ ఇద్దరు ఎలా ఒక్కటయ్యారు అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో వస్తోంది. రిలీజ్ డేట్ పోస్టర్‌ను కూడా ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టుగానే ఎట్రాక్టివ్ గా డిజైన్ చేశారు.
భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జూలై 17న రిలీజ్ కాబోతున్న ఈ ఎలెక్ట్రిఫైయింగ్ లవ్ స్టోరీ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.





