
ఫ్యామిలీ హీరో అనే టాగ్ లైన్ తో తిరువీర్(thiruveer)నిన్న ఐశ్వర్య రాజేష్ తో కలిసి 'ఓ సుకుమారి'(oh Sukumari)తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. తమిళంలో ఐశ్వర్య రాజేష్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా తమిళంలో కూడా రిలీజ్ చెయ్యడం జరిగింది. మరి తెలుగు, తమిళంలో తొలి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తమిళ వెర్షన్ కేవలం రెండు అంటే రెండు లక్షల రూపాయల నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది. తెలుగులో నలభై తొమ్మిది లక్షల రూపాయల నెట్ వచ్చింది. దాంతో మొదటి రోజు 'ఓ సుకుమారి' నెట్ కలెక్షన్స్ 51 లక్షల రూపాయలు కాగా గ్రాస్ విషయానికి వస్తే 57 లక్షల రూపాయలు. ఈ కలెక్షన్స్ తిరువీర్ కెరీర్ లోనే బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ చెప్పవచ్చు. మేకర్స్ మాత్రం ఇంకా కలెక్షన్స్ పై అధికార ప్రకటన చేయలేదు.. తిరువీర్ ప్రీవియస్ చిత్రాల ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకుంటే ;ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' .. ఓపెనింగ్ డే కలెక్షన్స్ 12 లక్షల నెట్. 'పాపం ప్రతాప్ కి 17 లక్షల నెట్ వచ్చింది. మరి ఆ ఆ రెండిటితో కంపార్ చేస్తే. 'ఓ సుకుమారి'తో తిరువీర్ తన కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ అందుకున్నాడు.
also read: కొత్త పెళ్ళికొడుకు అమీర్ ఖాన్ కి ప్రాణ హాని.. ఎవరి నుంచో తెలిస్తే షాక్ అవుతారు
ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ అవ్వడం హెల్ప్ అయ్యింది. 'సంకాంతికి వస్తున్నాం' వంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసి ఉండటం వల్ల ఆమె కోసం థియేటర్లకి వచ్చిన ఆడియన్స్ ఉన్నారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ని ముట్టుకుంటే షాక్ తగులుతుందనే కొత్త కాన్సెప్ట్‌తో ఓ సుకుమారి తెరకెక్కినా కూడా కథ లైన్ చుట్టూ అల్లుకునే కథనం, క్యారక్టర్ ల తీరు, డైలాగ్స్ బాగోకపోవడంతో ఓ సుకుమార్ కి నెగిటివ్ టాక్ రన్ అవుతుంది. భరత్ దర్శన్ దర్శకుడు కాగా గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పై మహేష్ రెడ్డి నిర్మించాడు. ఝాన్సీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మురళీధర్ గౌడ్ ఇతర రోల్స్ లో కనిపించారు.
thiruveer, Aishwarya Rajesh, oh sukumari






