ENGLISH | TELUGU  

ఇక లేట్ చేయకుండా వచ్చేస్తా! మీ అభిమానం కోసమే 

on Oct 17, 2024

యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)ప్రస్తుతం దేవర(devara)సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.చాలా ఏరియాల్లో సరికొత్త రికార్డులని నెలకొల్పిన దేవర ఓవర్ ఆల్ గా ఇప్పటి వరకు ఐదు వందల కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.ఎన్టీఆర్ కూడా ఈ విషయంపై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఒక నోట్ ని కూడా రిలీజ్ చేసాడు.అందులో దేవర కి పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్నతలని తెలియపరచడంతో పాటుగా అభిమానుల రుణం, ప్రేక్షకుల రుణం తేర్చుకోలేనిదని కూడా చెప్పుకొచ్చాడు.

ఇక ఎన్టీఆర్ తన కెరియర్ కి సంబంధించి మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇక పై వెంట వెంటనే సినిమాలు పూర్తి చేసి, వీలైనంత త్వరగా విడుదల చెయ్యాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఆ ఉద్దేశ్యంతోనే హృతిక్ రోషన్(hrithik roshan)తో కలిసి బాలీవుడ్ లో చేస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2(war 2)లో చేస్తున్న తారక్ నవంబర్ నుండి వార్ 2  కి డేట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.ఆల్రెడీ ఎన్టీఆర్ మీద ఇది వరకే కొంత భాగాన్ని కూడా చిత్రీకరించారు.ఇక ఆ షెడ్యూల్ పూర్తవ్వగానే ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా నవంబర్ లోనే ప్రశాంత్  నీల్(prashanth neel)మూవీ షూటింగ్ ని కూడా ప్రారంభించబోతున్నాడని అంటున్నారు.

ఇటీవలే అధికారంగా ప్రారంభమయిన ఈ మూవీ,షూట్ కి ఎన్టీఆర్ రావడం కొన్ని రోజులు లేట్ అయినా కూడా ఎన్టీఆర్ లేని సీన్స్‌కి సంబంధించిన షూట్ ని చిత్రీకరించేందుకు ప్రశాంత్  కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.ఈ రెండే కాకుండా దేవర పార్ట్ 2(devara part 2)కూడా వీలైంత త్వరగానే ప్రారంభించాలనే ప్లాన్ తోనే ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇప్పుడు ఈ వార్తలతో ఎన్టీఆర్ అభిమానులైతే ఫుల్ ఖుషితో ఉన్నారు.వాళ్ళు ఎప్పటినుంచో ఎన్టీఆర్ నుంచి సంవత్సరానికి ఒక సినిమా అయినా విడుదల కావాలని కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ వచ్చిన రెండున్నర ఏళ్ళకి దేవర పార్ట్ 1 రిలీజ్ అయ్యింది.

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.