Home

»

Latest News

ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్ నుంచి క్రేజీ లీక్! నెట్టింట వైరల్ 

Jul 14, 2026 5:27PM


మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)లో ఉన్న తుఫాన్ లాంటి యాక్టింగ్ కి సంబంధించిన మరో కొత్త కోణాన్ని పరిచయం చేస్తున్న మూవీ డ్రాగన్. ఈ విషయం టీజర్ ద్వారా చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. అభిమానులైతే రిలీజ్ డేట్ 2027 జూన్ 11 త్వరగా వస్తే ఎంత బాగుండు అని తమ ఊహల్లో సదరు డేట్ ని తలుచుకుంటూనే ఉన్నారు. దర్శకుడు ప్రశాంత్  నీల్ తన ప్రీవియస్ చిత్రాలైన 'కేజీఎఫ్' సిరీస్  'సలార్' ని మించి డ్రాగన్ ని హిట్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న డ్రాగన్ కి   సంబంధించిన సరికొత్త అప్‌డేట్ నెట్టింట  వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్‌లోని ప్రసిద్ధ రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో ఒక భారీ నైట్ షెడ్యూల్  చిత్రీకరణ) జరుగుతోంది. అత్యంత చలి వాతావరణంలో కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా, భారీ సెట్స్ మధ్య రాత్రి వేళల్లో ఈ షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, హీరోయిన్ రుక్మిణి వసంత్ పాల్గొంటున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని కీలకమైన రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, సినిమాకు వెన్నెముక లాంటి కొన్ని కీలకమైన సీన్లను ప్రశాంత్ నీల్ అర్ధరాత్రి వేళల్లో చిత్రీకరిస్తున్నారట. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్ డోస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు తగ్గట్టే ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌ మరింత నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లేలా, ఏకంగా 2,000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో కూడిన ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ ని  ప్లాన్ చేశారు. అంతేకాకుండా, ఇప్పటివరకు తన సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ జోలికి పెద్దగా వెళ్ళని ప్రశాంత్ నీల్.. ఈ సినిమాలో ఒక అదిరిపోయే మాస్ చార్ట్‌బస్టర్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఒక ప్రత్యేకమైన సెట్ వేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ అల్టిమేట్ డ్యాన్స్ పవర్‌కు సరిపోయేలా, ఒక టాప్ బాలీవుడ్ హీరోయిన్‌తో కలిసి ఈ స్పెషల్ నంబర్‌ను ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది.

Also read: shah rukh khan: షారుఖ్ ఖాన్‌ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇదే.. ఎందుకు ఇలా చేసారు!  


ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్‌ను పూర్తిగా మార్చేశారు. ప్రశాంత్ నీల్ డిజైన్ చేసిన 'ఇన్విన్సిబుల్' అవతార్ కోసం ఎన్టీఆర్ గుబురు గడ్డంతో, చాలా లీన్‌గా మరియు రగ్గడ్ బాడీతో కనిపించబోతున్నారు. రవి బస్రూర్ పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ షెడ్యూల్ ముగిసిన వెంటనే, తదుపరి భారీ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ సౌత్ ఆఫ్రికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సినిమాటిక్ విజువల్స్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా అభిమానులకి,ప్రేక్షకులకి  థియేటర్లలో ఒక మైండ్ బ్లోయింగ్ అనుభూతిని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. 

ntr, dragon, prashanth neel


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com