
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన లేటెస్ట్ ప్రాజెక్ట్ "ఇరుముడి". ఆగష్టు 21న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినీ సెలెబ్రిటీలు సైతం ఈ మూవీ పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నిర్మాత రవిశంకర్ బయటపెట్టారు.
ముఖ్యంగా 'ఇరుముడి' సినిమాపై మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, రెబెల్ స్టార్ ప్రభాస్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో ప్రొడ్యూసర్ రవిశంకర్ సరదాగా పంచుకున్న సీక్రెట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
"సాయంత్రం వేళల్లో ఎప్పుడైనా కలిసినప్పుడు ఎన్టీఆర్ గారు నన్ను సరదాగా ఏడిపిస్తూ ఉంటారు. మా నెక్స్ట్ సినిమాల గురించి సరదాగా మాట్లాడుతుంటారు. కానీ, ఇరుముడి టాపిక్ వస్తే ఈ సినిమా పక్కా సూపర్ హిట్ అంటారు." అంటూ రవిశంకర్ తెలిపారు.
"ఇరుముడి సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉందని ప్రభాస్ గారు కూడా అన్నారు. అందరికీ ఈ సినిమాపై పాజిటివ్ ఫీలింగ్ ఉంది." అంటూ రవిశంకర్ తన సంతోషాన్ని పంచుకున్నారు.
కాగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ 'డ్రాగన్' చేస్తుండగా, ప్రభాస్ 'ఫౌజీ' చేస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్స్ సమయంలోనే 'ఇరుముడి' సినిమా గురించి వారు మాట్లాడారు.
Ravi Teja, Irumudi Movie, NTR, Prabhas, Mythri Movie Makers





