నేను తల్లిని అవ్వాలా ఏంటి..ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను
on Nov 23, 2024
దక్షిణ భారతీయ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు నిత్య మీనన్(nithya menen)తెలుగు,తమిళ,కన్నడ, మలయాళ భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది.మూవీలో తన క్యారక్టర్ కి ప్రాధాన్య లేకపోతే ఎంత పెద్ద హీరో సినిమా అయినా కూడా రిజక్ట్ చేస్తుందంటే, నటన పట్ల ఆమెకి ఉన్న మక్కువని అర్ధం చేసుకోవచ్చు.బాలనటిగా 1998 లోనే ఒక ఇంగ్లీష్ చిత్రంలో చేసిన నిత్య మీనన్ ఇటీవలే 'తిరు'మూవీకి సంబంధించి జాతీయ ఉత్తమనటి అవార్డుని కూడా అందుకుంది.
ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 55 వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (iifa )ఈవెంట్ కి హాజరయ్యింది. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి మీడియాతో మాట్లాడుతు నటన అనేది భావోద్వేగానికి సంబంధించింది.దానికి వ్యక్తిగత అనుభవం అవసరం లేదు.ఒక మూవీలో తల్లి క్యారక్టర్ పోషించడానికి అనుభవం అవసరం లేదు.ఆ క్యారక్టర్ లో ఉండే భావోద్వేగాన్ని తెరపై చూపగలిగితే చాలు.మనం చేసే క్యారెక్టర్స్ పై మనకి పూర్తి విశ్వాసం ఉండాలి.మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి.లేదంటే ఆ ప్రభావం మనం పోషించే క్యారక్టర్ మీద పడుతుంది.
గతంలో నేనెప్పుడూ విచారంగా ఉండేదాన్ని.దాంతో సెంటిమెంట్ సీన్స్ లో సులభంగా నటించేదాన్ని.ఇప్పుడు అలాంటి సన్నివేశాలు చెయ్యడం చాలా కష్టంగా మారింది.బహుశా నేనిప్పుడు చాలా ఆనందంగా ఉంటున్నానేమో.ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజుల్లో తేలికపాటి పాత్రలని ఎంచుకున్నందుకు చాలా మంది నుంచి విమర్శలు వచ్చాయి.దాంతో కథల్నిఎంపిక చేసుకునే విధానాన్ని మార్చుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ధనుష్(dhanush)తో ఇడ్లి కడై, విజయ్ సేతుపతి(vijay sethupati)తో గోల్డెన్ వీసా వంటి చిత్రాల్లో నిత్య మీనన్ డిఫరెంట్ రోల్స్ ని నిత్య ప్లే చేస్తుంది.
Also Read