Home

»

Latest News

Nithya Menen: పెళ్లి, మాతృత్వంపై నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్

Apr 29, 2026 12:38PM

నాచురల్ పెర్ఫార్మ్ కి బ్రాండ్ అంబాసిడర్స్ లో నిత్య మీనన్(Nithya Menen) ఒకరు. అందుకే ఎంతో మంది అభిమానులని సంపాధించుకుంది. వివాదాలకు దూరంగా ఉంటూ, కేవలం నటనకి ప్రాధాన్యత గల క్యారెక్టర్స్ ని ఎంచుకునే నిత్య వ్యక్తిగత విషయాల గురించి చాలా అరుదుగా మాట్లాడుతుంటారు. అయితే, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన పెళ్లి  మాతృత్వం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాకి రెస్ట్ లేకుండా చేస్తున్నాయి. మరి ఏం మాట్లాడిందో చూద్దాం.

 ఆమె మాట్లాడుతు పెళ్లి అనేది ఒక సామాజిక బాధ్యతగా కాకుండా, ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండే బలమైన అనుబంధంగా ఉండాలి. పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకోవడం నాకు నచ్చదు. సరైన వ్యక్తి తోడైనప్పుడు అది సహజంగా జరగాలి. పిల్లలు కావాలనుకోవడం కూడా ఒక మహిళ పూర్తి నిర్ణయం. దానికి పెళ్లితో సంబంధం లేదు. పెళ్లి చేసుకోకుండానే తల్లి అయ్యే మార్గాలు చాలా ఉన్నాయి.  నాకు పిల్లలంటే చాలా ఇష్టం. కానీ ఒక బిడ్డను లోకంలోకి తీసుకురావడం అనేది చాలా పెద్ద బాధ్యత. కేవలం వయస్సు అయిపోతుందనో లేదా సమాజం అడుగుతుందనో పిల్లలని కనకూడదు. నా శరీరం, నా జీవితం, నిర్ణయం నాదే అయ్యి ఉండాలి.

Also read:  Varanasi: కొత్త మార్కెట్ పై వారణాసి గురి

ఒకవేళ భవిష్యత్తులో నాకు వివాహం కాకపోయినా, బయోలాజికల్ క్లాక్ దాటిపోయినా.. పిల్లల కోసం దత్తత వంటి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. దేనికీ నేను  భయపడను. ప్రస్తుతం కెరీర్ తో పాటు వ్యక్తిగత ప్రశాంతతకి మాత్రమే  ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పుకొచ్చింది. మరి నిత్య మాట్లాడిన ఈ మాటలు ఏ రేంజ్ లో ప్రభావం చూపిస్తాయో చెప్పక్కర్లేదు. గత ఏడాది ధనుష్ తో కలిసి  ఇడ్లి కొట్టుతో వచ్చిన నిత్య నుంచి స్టిల్ ఎలాంటి కొత్త సినిమా ప్రకటన ఇంకా రాలేదు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com