Home

»

Latest News

Niharika konidela: నీహారిక కొణిదెల విడాకులకి కారణం తెలిసింది.. ఇదే అసలు నిజం 

Mar 21, 2026

 

-డైవర్స్ పై నోరు విప్పిన నీహారిక 
-ఇన్ని రోజులు ఎన్నో ఊహాగానాలు 
-వాటన్నిటికీ చెక్
-అసలు నిజం ఏంటి! 


హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్ గా మారి హిట్ జర్నీని కొనసాగించడమంటే మాములు విషయం కాదు. అందుకు ఎన్నో గట్స్ ఉండాలి. పైగా ప్రెజెంట్ చాలా చిత్రాలు హిట్ అనే పదానికి డిస్టెన్స్ ని చాలా కాన్ఫిడెన్స్ గా మెయింటెన్ చేస్తూ వస్తున్నాయి. అలాంటిది నిహారిక కొణిదెల(Niharika konidela)'డెడ్ లైన్,  కమిటీ కుర్రోళ్ళు తో  విభిన్నమైన మేకర్ గా గుర్తింపు పొంది నిర్మాతగా సక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగిస్తోంది. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన  విడాకుల విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలేంటో చూద్దాం.


నీహారిక త్రీ ఇయర్స్ బ్యాక్ చైతన్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపైనే ఆమె మాట్లాడుతు ఎవరు కూడా విడిపోవాలని పెళ్లి చేసుకోరు. కానీ మా మధ్య వచ్చిన విభేదాలు పరిష్కరించలేనివి. అందుకే విడిపోవాలని ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకోవడం మంచిధనిపించింది. విడాకులు నిర్ణయం తీసుకున్న వెంటనే నాన్నకి చెప్పాను. సైలెంట్ గా విన్నారు. వాళ్లు కూడా పెళ్లి తర్వాత నన్ను చూస్తూనే ఉన్నారు. నీ జీవితంలో నువ్వు సంతోషంగా లేవనుకున్నప్పుడు ఎక్కడా ఉండాల్సిన అవసరం లేదు అన్నారు. ఒకరినొకరు బాగా గొడవపడి విడిపోతే అది తొందరగా మరచిపోతాం. కానీ ఇలా విడిపోతే ఆ బాధ నుంచి బయటపడటం చాలా కష్టం. ఈ విషయంలో విడాకులు అనేవి ఇప్పుడు తీసుకుంటున్నది కాదు. ఎప్పటినుంచో ఉంది.  విడాకులు తీసుకున్న తర్వాత ఫ్రెండ్ గా అతనితో  కాంటాక్ట్ లో కూడా లేనని నీహారిక చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తున్నాయి.  


Also read:  Allu arjun: తిప్పండి మీసం.. అన్నిటికి సమాధానం చెప్పే రోజు వచ్చింది!

 తన అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే వచ్చే నెల ఏప్రిల్ మూడున 'రాకాసా' అనే మూవీతో నిర్మాతగా మరో సారి ప్రేక్షకుల ముందుకు రానుంది.  సంగీత్ శోభన్,  నయన్ సారిక జంటగా చేస్తుండగా , మానస శర్మ(Manasa Sharma)దర్శకురాలు.

   

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com