Home

»

Latest News

NBK 111 టైటిల్ ఒక రేంజ్ లో ఉంది!

Aug 24, 2026 4:20PM

 


గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న మూవీపై  అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిసిందే. 'వీరసింహారెడ్డి' ని మించిన హిట్ ఇవ్వాలనే పట్టుదల  అయితే బాలయ్య, గోపీచంద్ లో ఉంది. అందుకే రిస్కీ ఫైట్స్ ని సైతం బాలకృష ఎలాంటి డూప్ లేకుండా చేస్తున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది.

 ఈ భారీ చిత్రానికి సంబంధించి మేకర్స్ 'GOD' (గాడ్), 'DADA' (దాదా) అనే రెండు శక్తివంతమైన టైటిల్స్‌ని పరిశీలిస్తున్నట్టుగా టాక్. అయితే  'GOD' అనే టైటిల్ పట్ల మేకర్స్ కాస్త ఎక్కువ మొగ్గు చూపుతున్నారని దాదాపుగా అదే టైటిల్ లాక్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలలో ఈ న్యూస్ వైరల్ గా మారడంతో మెజార్టీ అభిమానులు గాడ్ వైపు మొగ్గుచూపుతున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24 న వరల్డ్ వైడ్ రిలీజ్ ఉంటుందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది.

  Also Read: పెళ్లి పీటలెక్కిన హీరో ప్రిన్స్.. వధువు ఎవరో తెలుసా!

ఇప్పటికే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో ట్రెండ్ అవుతుంది.  షూటింగ్ విషయానికి వస్తే, ఇటీవల జరిగిన చిత్రీకరణలో బాలకృష్ణ స్వల్పంగా గాయపడటంతో మేకర్స్ కొద్దిరోజుల పాటు షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు. బాలయ్య కోలుకుంటుండటంతో సెప్టెంబర్ చివరి వారంలో గానీ లేదా అక్టోబర్ ప్రారంభంలో గానీ తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పెద్ది మూవీ నిర్మాత వెంకట సతీష్ కిలారు అత్యున్నత నిర్మాణ విలువలతో, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. థమన్ మ్యూజిక్.

Balakrishna, God, Dada, Gopichand Malineni

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com