Home

»

Latest News

నరేష్, పవిత్ర బంధంపై కొడుకు కీలక వ్యాఖ్యలు 

Feb 23, 2026 11:26AM

 

-2023 లో పెళ్లి తో ఒక్కటైన నరేష్, పవిత్ర 
-ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు
-సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కుమారుడి వ్యాఖ్యలు 


తెలుగు సినీ కళామతల్లికి దొరికిన మంచి నటుడు నరేష్(Naresh). ఈ విషయంలో ఎవరు ఒక్క పర్శంట్ కూడా డౌట్ ని వ్యక్తం చేసే సాహసం చేయరు. ఆయన నట స్టామినాని తెలియచేయడానికి మచ్చుకి కొన్ని క్యారెక్టర్స్ గురించి చెప్పుకుందామని అనుకున్నా,అలాంటి క్యారెక్టర్స్ ఎన్నో ఉన్నాయి. అదే టెంపోని కొనసాగిస్తూ రీసెంట్ గా 'హే బలవంత్' (Hey Balwanth) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొంత కాలం క్రితం ప్రముఖ నటి  పవిత్ర(Pavitra)ని జీవిత భాగస్వామిగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరి బంధంపై నరేష్ తనయుడు  నవీన్ విజయ్ కృష్ణ(Naveen Vijaya Krishna) తాజాగా కీలక వ్యాఖ్యలు చేసాడు. మరి సదరు వ్యాఖ్యల ఆంతర్యం ఏంటో చూద్దాం.

ఒక ఇంటర్వ్యూలో నవీన్ విజయ్ కృష్ణ మాట్లాడుతు పవిత్ర గారితో ఉన్నప్పుడు నాన్న చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. 50 ప్లస్ లో సైలెంట్‌గా, హ్యాపీగా ఉండటానికి ఆవిడే ప్రధాన కారణం. మా నాన్నకి సరైన జోడీ. ఎంతో మనసున్న మంచి వ్యక్తి. అందర్ని ప్రేమగా పలకరిస్తుంది. ప్రేమకి వయసనే హద్దులు లేవనడానికి ఆ ఇద్దరి బంధమే ఉదాహరణ. . నేను తరచూ మాట్లాడుతుంటాను.ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ లో పాజిటివ్ ఎనర్జీ పెరిగింది. తండ్రి సంతోషంగా ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. తాతయ్య నాయనమ్మ ఇద్దరు నాన్న తీసుకునే నిర్ణయాలకి ఎప్పుడూ మద్దతు ఇచ్చేవారని విజయ్ కృష్ణ చెప్పుకొచ్చాడు. స్టిల్ సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతు ఉన్నాయి.  

Also read:  ustaad Bhagat singh: ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ ఇదే


నరేష్ మొదటి భార్య కుమారుడే నవీన్ విజయ్ కృష్ణ.నందిని నర్సింగ్ హోమ్, ఊరంతా అనుకుంటున్నారు వంటి చిత్రాల్లో హీరోగా చేసాడు. దర్శకుడి గాను మారి  తన బెస్ట్ ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్(sai Dharam Tej)తో 'సత్య' అనే షార్ట్ ఫిల్మ్‌ రూపొందించగా మంచి అదరణని సొంతం చేసుకుంది. ప్రెజెంట్ ఎలాంటి సినీ న్యూస్ నవీన్ దగ్గరనుంచి లేదు. 

 

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com