హీరోయిన్ తో నారా రోహిత్ ఎంగేజ్ మెంట్
Oct 13, 2024 3:44PM

నటుడు నారా రోహిత్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తన రీసెంట్ మూవీ ప్రతినిధి 2 హీరోయిన్ శిరీష లెల్లతో ఆయన వివాహం జరగనుంది. నేడు (అక్టోబర్ 13) హైదరాబాద్ లో వీరి ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్ మెంట్ జరిగింది. రోహిత్ - శిరీష వివాహం డిసెంబర్ లో జరగనుందని తెలుస్తోంది. (Nara Rohit Engagement)
చంద్రబాబు సోదరుడు కుమారుడైన రోహిత్.. బాణం లాంటి విభిన్న చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. సోలో, ప్రతినిధి, రౌడీ ఫెలో, అసుర వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.





