
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ చూసిన ఏపీ మంత్రి నారా లోకేష్ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.
1800ల నాటి రాయలసీమను తెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉందంటూ నారా లోకేష్ కొనియాడారు. బ్రిటిష్ పాలన కాలంలో కరువు, అణచివేతకు సంబంధించిన హృదయవిదారక పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించారని ప్రశంసించారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన నారా లోకేష్.. విజయ్ దేవరకొండ నటన, రష్మిక మందన్న పాత్రతో పాటు దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ పనితీరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్టోబర్ 16న విడుదల కానున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రపై కూడా నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. రాయలసీమ మట్టిలో పుట్టి పెరిగిన వ్యక్తిలా విజయ్ సహజంగా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. విజయ్ నటనకు రష్మిక పాత్ర బలమైన తోడ్పాటునిస్తోందని లోకేష్ పేర్కొన్నారు. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్‌తో పాటు మొత్తం చిత్రబృందాన్ని అభినందించారు.
ఇప్పటికే రణబాలి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనగా.. నారా లోకేష్ ప్రశంసలతో ఆ ఆసక్తి రెట్టింపు అవుతోంది. అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రణబాలి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: శ్రీవిష్ణు నవ్వుల సునామీ.. కామ్రేడ్ కళ్యాణ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.!
[Nara Lokesh Tweet On Ranabaali Trailer, Nara Lokesh Twitter, Ranabaali Trailer, Nara Lokesh, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Ranabaali Release Date, Ranabaali Movie]




.webp)
.webp)
