Home

»

Latest News

నాని బాక్సాఫీస్ తాండవం: ఓవర్సీస్‌లో ‘ప్యారడైజ్’ ర్యాంపేజ్.!

Sep 18, 2026 12:58PM

న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'ది ప్యారడైజ్'. సెప్టెంబర్ 24న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఓవర్సీస్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.

'ది ప్యారడైజ్' మూవీ ఓవర్సీస్ ప్రీ-సేల్స్ నంబర్స్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఇప్పటికే నార్త్ అమెరికా ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ $450,000 మార్కును దాటేసి సంచలనం సృష్టించాయి. టోటల్ ఓవర్సీస్ ప్రీ-సేల్స్ ఏకంగా 5,50,000 డాలర్ల మైలురాయిని దాటేసింది. ట్రేడ్ అంచనా ప్రకారం ఈ సినిమా ప్రీమియర్స్ అండ్ ఫస్ట్ డే కలిపి దాదాపు 2 మిలియన్ డాలర్ల గ్రాస్ ఓపెనింగ్ దిశగా దూసుకెళ్తోంది.

ఈ సినిమాకి సెన్సార్ బోర్డు నుంచి ‘A’ సర్టిఫికేట్ లభించింది. 2 గంటల 49 నిమిషాల నిడివితో వస్తున్న ఈ చిత్రం, హై-వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్స్, అదిరిపోయే విజువల్స్‌తో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇవ్వబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కయదు లోహర్ నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసిన ‘ది ప్యారడైజ్’ మూవీ.. రూ.200 కోట్ల గ్రాస్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగుతోంది. ఓవర్సీస్ బుకింగ్స్ కి ఈ రేంజ్ రెస్పాన్స్ ఉందంటే.. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ రెస్పాన్స్ ఉంటుందనే ఆసక్తి నెలకొంది. 

 

 

 

[The Paradise USA Pre Sales, Paradise North America Pre Sales, Paradise Overseas Box Office, Nani Paradise Movie, The Paradise, Natural Star Nani, Srikanth Odela, Anirudh Ravichander, Kayadu Lohar, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com