ENGLISH | TELUGU  

100 కోట్లు కలెక్ట్‌ చేసిన ‘దసరా’ కంటే 100 రెట్లు బెటర్‌గా ‘నానిఓదెల2’!

on Sep 19, 2024

నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాలకు సుకుమార్‌ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసి మంచి అనుభవం సంపాదించిన శ్రీకాంత్‌ ఓదెల తొలి ప్రయత్నంగా నానితో ‘దసరా’ చిత్రాన్ని చేశారు. మొదటి చిత్రంతోనే తన టాలెంట్‌ ఏమిటో చూపించారు శ్రీకాంత్‌. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌గా ‘దసరా’ నిలిచింది. ఫుల్‌ రన్‌లో రూ.100 కోట్లు కలెక్ట్‌ చేసి నాని కెరీర్‌లోనే హయ్యస్ట్‌ గ్రాసర్‌ అయ్యింది. ఇప్పటివరకు నానిని ఎవరూ చూపించని ఫుల్‌ మాస్‌ క్యారెక్టర్‌తో కమర్షియల్‌ సక్సెస్‌ సాధించడం అంటే మామూలు విషయం కాదు. గురువు సుకుమార్‌ దగ్గర నేర్చుకున్న ఎన్నో అంశాలను కూడగట్టి ‘దసరా’ చిత్రాన్ని ఎంతో వైవిధ్యంగా రూపొందించారు శ్రీకాంత్‌. 

ఇప్పుడు నానితోనే తన రెండో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు శ్రీకాంత్‌. నాని 33వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన ఎనౌన్స్‌మెంట్‌ వీడియోను రూపొందించే పనిలో ఉన్నారు. ఈ విషయాన్ని తన ఎక్స్‌ ఎకౌంట్‌ ద్వారా తెలియజేశారు శ్రీకాంత్‌. ‘2023 మార్చి 7న నా దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమాకు లాస్ట్‌ కట్‌, షాట్‌ ఓకే చెప్పాను. 2024 సెప్టెంబరు 18న మళ్లీ షూటింగ్‌లో నా తాజా చిత్రం ‘నానిఓదెల2’ అనౌన్స్‌మెంట్‌ వీడియో కోసం  యాక్షన్‌ చెబుతున్నాను. నా మొదటి సినిమా ‘దసరా’ విడుదలై 4 కోట్ల 84 లక్షల 70 వేల 400 సెకన్లు గడిచిపోయాయి. నా తొలి సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తూనే ప్రతి సెకను నా తదుపరి చిత్రం ది బెస్ట్‌ ఇవ్వడం మీదే దృష్టి పెట్టాను. ‘దసరా’ చిత్రాన్ని మించి వంద రెట్లు ‘నానిఓదెల2’ ద్వారా ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేస్తానని మాట ఇస్తున్నాను’ అంటూ పోస్ట్‌ చేశారు శ్రీకాంత్‌ ఓదెల. ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల చేసిన ఈ పోస్ట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా ప్రారంభం కావడానికి ముందే తను చేయబోయే సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఈ పోస్ట్‌ ద్వారా తెలిపారు శ్రీకాంత్‌. విజయదశమికి ముందే తన కొత్త సినిమా ఎనౌన్స్‌మెంట్‌కి సంబంధించిన వీడియోను రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేసుకుంటున్నారు. తన తొలి సినిమా పబ్లిసిటీ, ప్రమోషన్స్‌ విషయంలో కూడా కొత్తగా ఆలోచించిన శ్రీకాంత్‌ రెండో సినిమాకి కూడా అదే పద్ధతిని పాటిస్తున్నారు. 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.