త్వరలో దర్శకుడిగా బాలయ్య!
Jun 10, 2020 2:24PM

శతాధిక చిత్రాల కథానాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ త్వరలో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఎటువంటి కథతో, ఎవరితో దర్శకుడిగా సినిమా చేస్తాననేది ఆయన ఇంకా చెప్పలేదు. కానీ త్వరలో తప్పకుండా ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని మాత్రం స్పష్టం చేశారు.
నిజానికి బాలకృష్ణ కొన్నేళ్ళ క్రితమే దర్శకుడిగా మారాల్సింది. దివంగత నటి సౌందర్య జీవించి ఉన్నప్పుడు దర్శకుడిగా ఆయన ఓ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. ఆయన కథానాయకుడిగా స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రారంభించారు. ఆ సినిమా టైటిల్ 'నర్తనశాల'. సౌందర్య హఠాన్మరణంతో ప్రారంభించిన చిత్రాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు మళ్లీ దర్శకుడిగా మరో చిత్రాన్ని చేయాలని అనుకుంటున్నారు.
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సినిమా కన్ఫామ్ చేయలేదు. ఒకవేళ బోయపాటి తర్వాత తన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారేమో!



.jpg)
