Home

»

Latest News

Nagarjuna: నాగార్జునతో మూవీపై అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్

Jun 15, 2026 11:28AM

 

 

-ఇది కదా కాంబో అంటున్న అక్కినేని ఫ్యాన్స్ 
-కింగ్ నాగార్జున, అనిల్ రావిపూడి మూవీ ఫిక్స్ అవ్వబోతుందా!
-అనిల్ రావిపూడి మాటలతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా 
-మాకు ఆ నాగార్జున కావాలంటూ కూడా కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్ 

కింగ్ నాగార్జున..(Nagarjuna)క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)ఈ ఇద్దరి పేర్లు పక్క పక్కన వింటేనే, ఈ ఇద్దరి కాంబోలో మూవీ వస్తుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఆతృత చూపించే పరిస్థితి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌పై సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు  వచ్చినప్పటికీ అవి కేవలం రూమర్స్ గానే మిగిలిపోయాయి. కానీ తాజాగా జరిగిన ఒక టాక్ షో ప్రమోషన్స్ కార్యక్రమంలో అనిల్ రావిపూడి స్వయంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అక్కినేని అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి


సదరు టాక్ షోలో అనిల్ రావిపూడితో పాటు పాల్గొన్న సీనియర్ నటి రాధ మాట్లాడుతూ 'నేను గతంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి నలుగురు అగ్ర హీరోలతో సినిమాలు చేశానని గుర్తుచేసుకున్నారు. సదరు మాటలపై స్పందించిన అనిల్ రావిపూడి ' నేను  ఇప్పటికే చిరు, బాలయ్య, వెంకీలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ నిర్మించాను. నాగార్జున గారితో కూడా త్వరలోనే ఒక మూవీ చేయబోతున్నానని వెల్లడి చేసాడు. ఈ ఒక్క మాటతో నాగార్జున, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ దాదాపు ఖాయమైయినట్లే అని  సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే, టాలీవుడ్ ఒకే జనరేషన్‌కి  చెందిన చిరంజీవి, బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, నాగార్జున వంటి  నలుగురు టాప్ సీనియర్ స్టార్ హీరోలని  డైరెక్ట్ చేసిన వ్యక్తిగా అనిల్ రావిపూడి సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయం. ఇక ఈ మూవీ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అక్కినేని అభిమానులు స్పందిస్తూ' అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైనర్ లో తమ హీరోని  'హలో బ్రదర్'  ఘరానా బుల్లోడు సినిమాల తరహా అవుట్ అండ్ అవుట్ కామిక్  మాస్ రోల్‌లో చూడాలని ఉందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Also read: Allu Arjun: ఆ హీరో మూవీ దారిలోనే రాకా!.. ఫాన్స్ ఏమంటారో చూడాలి


అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్,కళ్యాణ్ రామ్‌తో జాయిన్ అయ్యాడు. 2027 సంక్రాంతి రేసులో నిలిచేలా షూటింగ్ జరుపుకోనుంది. మరోవైపు కింగ్ నాగార్జున  తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాని 'రా కార్తీక్' దర్శకత్వంలో చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం పూర్తి కాగానే అనిల్ రావిపూడితో  స్టార్ట్ అవ్వచ్చు. ఈ ప్రాజెక్ట్‌కి  సంబంధించిన అధికారిక ప్రకటనతో మరిన్ని వివరాలు అక్కినేని ఫ్యాన్స్ లో జోష్ ని తెప్పించనున్నాయి.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com