Home

»

Latest News

నాగార్జున 100 వ చిత్రం గ్లింప్స్‌ రిలీజ్.. టైటిల్ ఇదేనా!

Aug 26, 2026 2:57PM

 

కింగ్ నాగార్జున తన వందవ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ముప్పై ఏళ్ళ క్రితమే తెలుగు సినిమాకి పాన్ ఇండియా సువాసనాలని అద్దిన నాగార్జున తన వందవ చిత్రాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాడో చెప్పక్కర్లేదు.  ఈ మైల్‌స్టోన్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫస్ట్ లుక్, సినిమా అధికారిక టైటిల్, గ్లింప్స్‌ ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు కానుకగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్రబృందం పక్కాగా సన్నాహాలు చేస్తోంది. 

ఇప్పటివరకు సినిమా నుంచి ఒక్క పోస్టర్ కానీ, పిక్చర్ కానీ బయటకి రాకపోవడంతో ఈ ప్రచార అప్‌డేట్‌పై అక్కినేని అభిమానులలో అంచనాలు నెక్ట్స్ లెవెల్‌కి  చేరుకున్నాయి.  ఈ భారీ మైల్‌స్టోన్ ప్రాజెక్ట్‌కు తమిళ సినీ పరిశ్రమకి చెందిన రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, నాగార్జున తన సొంత బ్యానర్  అన్నపూర్ణ స్టూడియోస్‌పై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ఒక అరుదైన విశేషం ఏమిటంటే.. దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ ప్రముఖ నటి టబు, నాగార్జున కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది.  వీరితో పాటు ఐశ్వర్య రాజేష్, సుస్మితా భట్ మరియు విజయేంద్ర కీలక పాత్రలలో మెప్పించనున్నారు.  సాంకేతికంగా కూడా ఈ 100వ సినిమా టాలీవుడ్‌లో ఒక విజువల్ వండర్‌గా నిలవబోతోంది. 

Also Read: కారణం ఇదే 

కథలో భాగంగా నాగార్జున క్యారక్టర్  25 ఏళ్ల నవ యువకుడి నుండి 60 ఏళ్ల వయస్సు గల వ్యక్తి వరకు రకరకాల గెటప్స్‌లో కనిపిస్తుంది. ఇందుకోసం అధునాతన 'డీ-ఏజింగ్'  హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. వర్కింగ్ టైటిల్‌గా '#King100' ప్రచారంలో ఉన్నప్పటికీ, ఈ చిత్రానికి 'నెక్ట్స్ లెవెల్' లేదా 'లాటరీ కింగ్' అనే టైటిల్స్‌ని చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్టుగా టాక్.  

Nagarjuna, Raa karthik, Tabu

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com