Home

»

Latest News

పాన్ ఇండియా అడ్వెంచర్ 'నాగబంధం' ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?  

Jun 17, 2026 5:54PM

టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తూ, దర్శకుడిగానూ మెప్పిస్తున్న అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ ‘నాగబంధం - ది సీక్రెట్ ట్రెజర్’. యంగ్ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, సాంగ్స్ ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను అనౌన్స్ చేసింది. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముహూర్తం ఖరారైంది.  

ఈ క్రేజీ ప్రాజెక్ట్ ట్రైలర్‌ను జూన్ 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీప్లెక్స్ ప్రసాద్స్ పీసీఎక్స్ (Prasads PCX) స్క్రీన్‌పై సాయంత్రం 4 గంటల నుంచి ఈ గ్రాండ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ భారీ కాన్వాస్ ఫాంటసీ విజువల్స్‌ను థియేటర్ స్క్రీన్‌పై లాంచ్ చేసి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.  ఈ చిత్రంలో విరాట్ కర్ణ సరసన టాలెంటెడ్ బ్యూటీ నభా నటేష్ కథానాయికగా నటిస్తోంది. అలాగే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య మీనన్, దక్ష నగార్కర్, రిషబ్ సాహ్ని కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపూరెడ్డి, నిశిత రెడ్డి ఈ విజువల్ వండర్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.  

ఇటీవలే చిత్ర బృందం ప్రమోషన్స్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ‘అనంత పద్మనాభ స్వామి రథయాత్ర’ను ప్రారంభించి సరికొత్త ట్రెండ్‌కు తెరలేపింది. దైవత్వంతో కూడిన ఈ ప్రమోషనల్ క్యాంపెయిన్‌కు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి, సినీ ప్రియుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. సినిమాలోని పురాతన రహస్యాలు, నిధుల వేట అనే కాన్సెప్ట్ ప్రేక్షకులను బాగా ఎగ్జైట్ చేస్తోంది. 

 ప్రస్తుతం ఈ ట్రైలర్ అప్‌డేట్‌తో టాలీవుడ్ సర్కిల్స్‌లో గట్టి బజ్ నడుస్తోంది. కార్తికేయ-2, హనుమాన్ తరహాలోనే ఈ మైథలాజికల్ ఫాంటసీ డ్రామా కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. అంతకంటే ముందు జూన్ 19న రాబోయే ఈ ట్రైలర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com