
'తండేల్'తో హిట్ ట్రాక్ లోకి వచ్చిన యువసామ్రాట్ నాగచైతన్య(Naga chaitanya)ప్రస్తుతం 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు(Karthik Dandu)దర్శకత్వంలో 'వృషకర్మ' అనే మైథలాజికల్ అడ్వెంచర్ పీరియాడిక్ మిస్టరీ థ్రిల్లర్‌లో చేస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనుల్లో ఉన్న ఈ చిత్రంపై ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రచార చిత్రాలు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగిస్తున్నాయి.
ఈ చిత్రం కంప్లీట్ అయిన తర్వాత తమిళ దర్శకుడు లింగుస్వామి(LIngusamy)దర్శకత్వంలో చైతు చెయ్యబోతున్నాడనే న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. లింగుస్వామి నుంచి గతంలో 'ఆనందం', 'రన్', 'పందెం కోడి' ,'ఆవారా' వంటి విభిన్న చిత్రాలు వచ్చాయి. యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో కూడిన ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ని లింగుస్వామి సిద్ధం చేశారని, చైతుని మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్ పంథాలో ఆవిష్కరించనుందని ఇండస్ట్రీ టాక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా రావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ కాబోతుండటంపై టాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీసింది.
సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కూడా స్పందిస్తూ ఒకప్పుడు వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన లింగుస్వామి ట్రాక్ రికార్డ్ ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో లేదు. రామ్ పోతినేనితో తెరకెక్కించిన ప్రీవియస్ మూవీ 'ది వారియర్' డిజాస్టర్‌గా నిలిచింది. అంతకుముందు లింగుస్వామి చేసిన చిత్రాలు కూడా వరుసగా ప్లాప్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే 'తండేల్' తో 100 కోట్ల మైల్‌స్టోన్ హిట్‌తో ఫామ్‌లోకి వచ్చిన చైతు రిస్క్ చేయడం అవసరమా అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also read: Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్ చూద్దాం
గతంలో నాగచైతన్య మరో తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభును నమ్మి చేసిన 'కస్టడీ' సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచిన సంగతిని అక్కినేని ఫ్యాన్స్ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.







