Home

»

Latest News

మైత్రీ మూవీ మేకర్స్ రిస్క్ ఫలించింది.. ఇరుముడి 200 కోట్లు పక్కా

Aug 22, 2026 5:58PM

 


మైత్రీ మూవీ మేకర్స్.. స్టార్ హీరో రేంజ్ లో ఫ్యాన్ బేస్ సంపాదించి పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతుంది. అసలు సిసలు కళామ తల్లి ముద్దుబిడ్డల్లా  ట్వంటీ ఫోర్ అవర్స్  సినిమా గురించి ఆలోచించడంతో పాటు ఎలాంటి సబ్జెట్ తో కూడిన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలో అని నిరంతరం ఆలోచిస్తూ ఉండటం మైత్రి స్పెషాలిటీ. అందుకే కష్టే ఫలి అనే రీతిలో పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతుంది. ఇప్పుడు 'ఇరుముడి'తో  బాక్సాఫీస్ వద్ద విజిల్ వేస్తుంది.

అయితే ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్ వెనుక మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్న ఒక పెద్ద రిస్క్, ఓటీటీ వ్యాపారంలో నడిచిన ఆసక్తికర నాటకం ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైన సమయంలో మైత్రీ మేకర్స్ చాలా నమ్మకంతో ముందడుగు వేసినప్పటికీ, వ్యాపార పరంగా అనేక సవాళ్లు ఎదురయ్యాయి. 'ధమాకా'  తర్వాత రవితేజకి  సరైన హిట్ పడకపోవడం, వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లు రావడం వల్ల ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల పట్ల డిజిటల్ దిగ్గజాలు మొదట్లో పెద్దగా ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్ట్‌పై పెద్దగా ఉత్సాహం చూపించలేదు. అయినప్పటికీ, మైత్రీ మూవీ మేకర్స్ తమ కంటెంట్‌పై ఉన్న అమితమైన నమ్మకంతో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. శివ నిర్వాణ సిద్ధం చేసిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కథాంశం, రవితేజను గతంలో ఎన్నడూ చూడని కొత్త తరహా మేకోవర్‌లో చూపించే విధానం కచ్చితంగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని నిర్మాతలు నమ్మారు. ఎటువంటి రాజీ పడకుండా  సుమారు 14 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, మరియు 'ఇరుముడి' టైటిల్ విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.


Also Read: డిసి తర్వాత లోకేష్ కనగరాజ్ హీరోగా చేసేది ఈ డైరెక్టర్ తోనే!


ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై పెరిగిన ఈ రకమైన హైప్‌ను గమనించిన నెట్‌ఫ్లిక్స్ సంస్థ వెంటనే తమ నిర్ణయాన్ని మార్చుకుంది. మైత్రీ మూవీ మేకర్స్‌తో చర్చలు జరిపి, చివరకి  భారీ ఫ్యాన్సీ ధరకు డిజిటల్ హక్కులను చేజిక్కించుకుంది. ఇక ఇరుముడి తొలి రోజు 24 కోట్లని సాధించగా ఈ వీకెండ్ లో 100 కోట్ల క్లబ్ పక్కా అనే మాటలు ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.  అందుకు తగ్గట్టే రేపట్నుంచి ఐదో షో కూడా ప్రదర్శితమవుతోంది.  పూర్తి రన్ లో 200 కోట్లు అనే మాటలు సినీ సర్కిల్స్ లో తాజా న్యూస్ హోదాలో చక్కర్లు కొడుతున్నాయి. 

Irumudi, Raviteja, Mythri Movie Makers

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com