
'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' అంటు తన డ్యాన్స్‌తో, గ్లామర్‌తో కుర్రకారును ఊపేసిన నటి ముమైత్ ఖాన్(Mumaith khan). 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ రేంజ్ కి కూడా వెళ్ళింది. కానీ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మాయమైపోయింది. కోమాలోకి వెళ్లడమే అందుకు కారణం. ఆ విషయాల గురించి పూర్తి వివరాలు చెప్పింది.
ఆమె మాట్లాడుతు నేను కోమా నుంచి స్పృహలోకి వచ్చిన తర్వాత కూడా అసలు సిసలైన నరకాన్ని చూసాను. మెదడుకి జరిగిన సర్జరీలో భాగంగా నా తలలో ఏకంగా 9 టైటానియం వైర్లని అమర్చారు. ఆపరేషన్ తర్వాత తరచూ సీజర్ అటాక్స్ (ఫిట్స్) రావడం మొదలైంది. దాంతో తీవ్రమైన డిప్రెషన్, మానసిక ఒత్తిడి చుట్టుముట్టాయి. వైద్యులు కనీసం 7 ఏళ్ల పాటు ఎలాంటి పనులు చేయకుండా, మంచానికే పరిమితం కావాలని కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. చిన్న వస్తువుని ఎత్తడం కూడా ఒక పెద్ద యుద్ధంలా అనిపించేది. వాడాల్సిన భారీ మందుల (స్టెరాయిడ్స్) కారణంగా విపరీతంగా బరువు పెరిగాను. గ్లామర్ ఇండస్ట్రీలో ఉంటూ, శారీరక రూపాన్ని కోల్పోవడం, కదలలేని స్థితికి చేరడం తీవ్రమైన మానసిక వేదనకు గురిచేసింది. కానీ నేను ఓటమిని అంగీకరించలేదు. జీవితం అంటేనే ఒక హార్ట్ బీట్ గ్రాఫ్ లాంటిదని, అది ఎప్పుడూ అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుందని, అప్పుడే మనం బ్రతికి ఉన్నట్లు లెక్క అని నమ్మాను. దేవుడు సక్సెస్ ఇచ్చినట్లే, ఈ డిప్రెషన్‌ను, బ్రెయిన్ సర్జరీ బ్రేక్‌ని కూడా ఒక ఆశీర్వాదంగానే ఇచ్చానని భావించానని ముమైత్ చెప్పుకొచ్చింది.
Also read: Nikhila vimal: ప్రముఖ హీరోయిన్ నికిలా విమల్ పెళ్లి!.. వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ముమైత్ ఖాన్ కోమాలోకి వెళ్లిన విషయానికి వస్తే స్నానం చేసి వచ్చి, పాట పాడుకుంటూ అద్దం ముందుకు వెళ్తున్న సమయంలో ఊహించని విధంగా కిందపడిపోయారు. ఆమె తల ఇటాలియన్ బెడ్ మూలకు చాలా బలంగా తగిలింది. మొదట్లో ఆమె దీనిని పెద్దగా పట్టించుకోలేదు కానీ, ఆ దెబ్బ ఆమె మెదడులోని నరాలపై తీవ్ర ప్రభావం చూపించింది. బ్రెయిన్ హెమరేజ్ (మెదడులో రక్తస్రావం) కావడంతో ఆమె ఏకంగా 15 రోజుల పాటు కోమాలోకి వెళ్లిపోయారు.






