TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

మోహన్ బాబు మొత్తం ఆస్తులు ఇవే!..ఎవరెవరికి ఎంత ఇచ్చాడంటే!

Dec 12, 2024 3:27PM

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(mohan babu)మనోజ్(manoj)మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఆస్తుల కోసం కాదని,ఆత్మగౌరవం గురించని మనోజ్ మొదటినుంచి చెప్తున్నా కూడా  ఆస్తుల గురించే గొడవనే ప్రచారం తాజాగా తెర మీదకి వస్తుంది.దీంతో అసలు మోహన్ బాబు కి ఉన్న ఆస్తులు ఎన్ని ఇప్పటి వరకు తన ముగ్గురు పిల్లల్లో ఎవరెవరికి ఎంత ఇచ్చాడనే చర్చ జరుగుతుంది.


మోహన్ బాబుకి హైదరాబాద్ నగరంలో పలు ఏరియాల్లో ప్లాట్ లతో పాటు,ఫిలింనగర్ మెయిన్ రోడ్ పై  ఒక ఇల్లు, జల్ పల్లి లో ఇప్పుడు మోహన్ బాబు ఉంటున్న ముప్పై ఎకరాల్లోని ఫామ్ హౌస్, సొంతూరు లో ఇల్లు,వ్యవసాయ భూమి,సినిమా పరిశ్రమకి సంబంధించి శ్రీలక్షిప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ,మంచు ఎంటర్ టైన్మెంట్ వంటి సంస్థలతో పాటు మరికొన్ని ఆస్తులు ఉన్నాయని అంటున్నారు.వీటన్నిటి విలువ సుమారు 600 వందల కోట్లపై మాటే అనే ప్రచారం చాలా జోరుగానే జరుగుతుంది.

ఇందులో ఫిలింనగర్ ఇంటిని లక్ష్మి(manchu lakshmi)పేరు మీద రాయగా, విష్ణు(vishnu)కి విద్యానికేతన్ వ్యవహారాలతో పాటు 24 ఫ్రేమ్ నిర్మాణ బాధ్యతలని అప్పచెప్పడం జరగగా హైదరాబాద్ శివారులోని ఒక  ఫ్లాట్ ని మనోజ్ కి ఇవ్వడం జరిగిందని అంటున్నారు.కానీ ఇప్పుడుజల్ పల్లి ఫామ్ హౌస్ ని మనోజ్ అడుగుతున్నాడని,కాకపోతే ఈ ఆస్తులన్నీ తను సంపాదించుకున్నవే కాబట్టి నేను ఎవరకి ఇస్తానో నా ఇష్టం అవసరమైతే దానం చేస్తానని కూడా మోహన్ బాబు అన్నట్టు సమాచారం.ఇక విష్ణుకి శ్రీ విద్యానికేతన్ ని పూర్తిగా అప్పగించడంతో విద్యానికేతన్ సిఈఓ  వినయ్ మనోజ్ ని లెక్కచేయడం లేదని,ఆ విషయంలో కూడా మనోజ్ హార్ట్ అయ్యి గొడవకి దిగితున్నాడనే మాటలు కూడా వినపడుతున్నాయి.

 

google-ad-img