హాస్పిటల్ లో మోహన్ బాబు..అభిమానులు కంగారు పడాల్సిన పని లేదు
on Dec 10, 2024
విలన్ నుంచి హీరో స్థాయికి ఎదిగి చరిత్రలో నిలిచిపోయే సినిమాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న లెజండరీ నటుడు మోహన్ బాబు(mohan babu)పలు సినిమాలని కూడా నిర్మించిన మోహన్ బాబు తన నటవారసులుగా తన ఇద్దరు కుమారులైన విష్ణు,మనోజ్ లని ఇండస్ట్రీకి పరిచయం చేసి కళామతల్లి ఋణం కూడా తీర్చుకున్నాడని చెప్పవచ్చు.ఇక రెండు రోజులుగా మనోజ్(manoj)మోహన్ బాబు మధ్య కుటుంబ పరమైన గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ విషయంలో మనోజ్ ని ఉద్దెశించి మోహన్ బాబు ఒక వీడియో కూడా రిలీజ్ చేసాడు. అందులో మనోజ్ అంటే మోహన్ బాబు కి ఎంత ప్రేమో క్లియర్ గా అర్ధమయ్యింది.కొన్ని నాటకీయ పరిణామాల మధ్య నిన్న రాత్రి అయితే గొడవ తార స్థాయికి చేరింది.
ఈ వరుస సంఘటనలతో మోహన్ బాబు తీవ్ర కలత చెందడమే కాకుండా టెన్షన్ కి గురయినట్టు తెలుస్తుంది.దీంతో అస్వస్థతతో మోహన్ బాబు గచ్చిబౌలి లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేరడం జరిగింది.ప్రస్తుతం వైద్యులు ఆయనకి చికిత్స అందిస్తున్నారు.ఇక ఈ సంఘటనతో మోహన్ బాబు అభిమానులు కంగారు పడ్డారు. ఇక మోహన్ బాబు వెంట హాస్పిటల్ లో విష్ణు(vishnu)కూడా ఉన్నాడు.మనోజ్ తల్లి కూడా వరుసగా జరుగుతున్న సంఘటనలతో ఆందోళనకు లోనవ్వడంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఉంది.