Home

»

Latest News

Chiranjeevi: మెహర్ రమేష్ కూతురు ఎంగేజ్ మెంట్ వీడియో వైరల్.. గత నెల 26 న చిరు ఏం చేసాడో తెలుసా!

May 9, 2026 12:22PM

 

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి సోదరుడి వరుస అయ్యే  మెహర్ రమేష్(Meher Ramesh)దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచయస్తుడే. మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశంతో కంత్రి దగ్గరనుంచి భోళా శంకర్ వరకు మొత్తం ఏడు సినిమాలు తెరకెక్కించాడు. రీసెంట్ గా మెహర్ రమేష్ తన కూతురు మోహన నిశ్చితార్థం వీడియోని  సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీంతో సోషల్ మీడియా కొత్త న్యూస్ తో కళకళ లాడుతూ ఉంది. మరి ఆ వేడుక డీటెయిల్స్ చూద్దాం

చిరంజీవి, సురేఖ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిరంజీవి దంపతుల చేతుల మీదుగానే కాబోయే వధూవరులు మోహన(Mohana),అనిరుధ్(Anirudh)ఉంగరాలు మార్చుకున్నారు. అనంతరం చిరంజీవి స్వయంగా దగ్గరుండి కొత్త జంటని  ఆశీర్వదిం చాడు. ఇప్పుడు ఈ దృశ్యాలు అభిమానులని  ఆకట్టుకుంటున్నాయి. విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్, సునీల్, నమ్రతా శిరోద్కర్, సితార ఘట్టమనేని, దర్శకుడు వి.వి. వినాయక్ తదితరులు హాజరై కొత్త జంటకి  శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను దీవించారు. 


Also read: Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం దర్శకత్వంలో రియాలిటీ మూవీ.. టార్గెట్ ఆ వ్యక్తులేనా! 

ముఖ్యంగా మహేష్ బాబు గారాల పట్టి సితార ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహేష్ నుంచి వచ్చిన 'బాబీ' మూవీలో మెహర్ రమేష్ మహేష్ ఫ్రెండ్ గా చేసాడు. అప్పట్నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. మోహన ,అనిరుధ్  వివాహం ఈ ఏడాది చివరలోనే జరగనున్నట్లు సమాచారం. త్వరలోనే పెళ్లి తేదీకి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.గత నెల 26 న ఎంగేజ్ మెంట్ జరగగా అభిమానుల కోసమే మెహర్ సదరు వీడియోని రిలీజ్ చేసాడు.


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com