స్కూల్ పిల్లలా మజాకా..బండ బూతులు తిడుతున్న బుడ్డ ఫ్యాన్స్!
on Jun 15, 2024
ప్రజెంట్ జనరేషన్‌లో సోషల్ మీడియాకి ప్రాధాన్యం పెరిగిపోయింది. నిన్న మొన్నటి వరకు పెద్దవాళ్ళే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండేవారు. ఇప్పుడు పిల్లలు కూడా తోడయ్యారు. హీరో ఫ్యాన్స్ ఎక్కువగా సోషల్ మీడియాలోనే కౌంటర్లు వేసుకుంటూ ఉంటారు. అలాంటిది స్కూల్‌కి వెళ్ళే చిన్న పిల్లలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బూతులు తిడుతూ రచ్చ చేస్తున్నారు.
విషయం ఏమిటంటే.. ఎన్నికల ఫలితాల తర్వాత బన్నీని మెగా ఫ్యాన్స్, జనసైనికులు ఎంతగా ట్రోల్ చేస్తున్నారో తెలిసిందే. తాజాగా సాయిధరమ్‌తేజ్ బన్నీని అన్‌ఫాలో కొట్టడంతో బన్నీ ఫ్యాన్స్ మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పుడీ ఫ్యాన్ వార్ వాడిగా, వేడిగా మారింది. బన్నీ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియా వేదికగా ఒక చోట చేరి ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలు బన్నీకి ఫేవర్‌గా మాట్లాడుతూ మా బన్నీని ఏమైనా అంటే ఊరుకోం అని పచ్చి బూతులు తిడుతూ రెచ్చిపోతున్నారు.
మెగా ఫ్యాన్ అయిన గని భాయ్‌ని టార్గెట్ చేస్తూ ఈ పిల్లలు వార్నింగ్ ఇస్తుంటే.. ‘మీది ఏ స్కూల్.. స్కూల్‌కి నిక్కర్ వేసుకుని వెళ్తారా? ప్యాంట్ వేసుకుని వెళ్తారా?’ అంటూ వారి గాలి తీసేస్తున్నాడు. స్కూల్ స్టేజ్‌లోనే ఉన్న ఈ పిల్లలు ఇలా ట్విట్టర్‌లోకి వచ్చి పచ్చి బూతులు తిట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వారి పేరెంట్స్ వీరికి అంత స్వేచ్ఛ ఎలా ఇచ్చారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. చదువును పక్కన పెట్టి ఈ వయసులోనే సోషల్ మీడియాలో ఇలా రెచ్చిపోతుంటే వారిని ఎందుకు కంట్రోల్ చెయ్యడం లేదు అంటూ అందరూ కామెంట్ చేస్తున్నారు.