
మన శంకరవరప్రసాద్ గారు తో ఎంటైర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తన కొత్త మూవీని బాబీ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. కేవీఎన్ ప్రొడక్షన్స్ పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రం నిన్ననే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అరవింద్ వంటి ప్రముఖుల సమక్షంలో అత్యంత ఘనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎలాంటి ఆలస్యం లేకుండా, పూజ జరిగిన మరుసటి రోజే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించడం మెగాఅభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న హైకోర్టు సమీపంలోని చారిత్రక గవర్నమెంట్ సిటీ కాలేజ్ ప్రాంగణంలో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కాలేజ్ భవనం నేపథ్యంలో వచ్చే కొన్ని కీలకమైన సన్నివేశాలని చిరంజీవి, మలయాళీ ముద్దుగుమ్మ అనస్వరా రాజన్ పై చిత్రీకరిస్తున్నట్టుగా టాక్. అనస్వరా రాజన్ మెగాస్టార్ కూతురి క్యారక్టర్ లో చేస్తున్నట్టుగా టాక్.
also read: rowdy Janardana: రౌడీ జనార్దన క్రేజీ అప్ డేట్.. ఒక్కరు కాదు ఇద్దరు
చిత్ర బృందం రీసెంట్ గా తమ సినిమాకి సంబంధించిన సాంకేతిక నిపుణల బృందాన్ని పరిచయం చేస్తూ ఒక ఫన్నీ వీడియోని రిలీజ్ చేసింది.సదరు వీడియో కొన్ని గంటల్లోనే లక్షలాది వ్యూస్‌తో ట్రెండింగ్‌గా మారింది. దీన్ని బట్టి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలని అర్ధం చేసుకోవచ్చు. మెగా స్టార్ నుంచి వస్తున్న ఈ 158 వ మూవీకి థమన్ స్వరాలు అందిస్తుండగా, కోన వెంకట్, చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిరంజీవి మునుపెన్నడూ కనపడని వైల్డ్ ఫియర్‌లెస్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.






