TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

మంచు హీరో దెబ్బకి హనుమాన్ నిలబడగలడా?

May 19, 2024 5:14PM

మంచు మనోజ్ (Manchu Manoj) విలన్ గా ఎంట్రీ ఇస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. 'మిరాయ్' (Mirai) సినిమాతో పవర్ ఫుల్ విలన్ గా మనోజ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోజ్.. ఏవో కారణాల వల్ల కొంతకాలం నటనను బ్రేక్ ఇచ్చాడు. 2017 లో వచ్చిన 'ఒక్కడు మిగిలాడు' తర్వాత అతను హీరోగా నటించిన సినిమా రాలేదు. హీరోగా రీఎంట్రీ ఇస్తూ గతేడాది 'వాట్ ది ఫిష్' అనే సినిమా ప్రకటించాడు. కానీ కొంతకాలంగా దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ లేవు. ఈ క్రమంలో మనోజ్ విలన్ గా ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటన రావడం ఆసక్తికరంగా మారింది.

'హనుమాన్'తో సంచలన విజయాన్ని అందుకొని పాన్ ఇండియా హీరోగా అవతరించిన తేజ సజ్జా (Teja Sajja) నటిస్తున్న తాజా చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. తేజ పాత్రను పరిచయం చేస్తూ ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మనోజ్ పాత్రను చూసే టైం వచ్చింది. మనోజ్ పుట్టినరోజు సందర్భంగా రేపు(మే 20) ఉదయం ఆయన పాత్రకి సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ పవర్ ఫుల్ గా ఉంది.

'మిరాయ్' చిత్రం 2025, ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఇందులో తేజ, మనోజ్ మధ్య వార్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది.

google-ad-img