Home

»

Latest News

నా కులం అదే.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్

Aug 10, 2026 6:18PM


మంచు మనోజ్.. ఈ పేరుకి తెలుగు సినిమాకి ఉన్న అనుబంధం తెలిసిందే. హీరోగానే కాదు నెగిటివ్ రోల్ లోను తన మానియా స్పషంగా చాటగలనని మిరాయ్ తో నిరూపించిన మనోజ్ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ రోజు హైదరాబాద్ లోని  AAA సినిమాస్‌లో 'గజ' చిత్ర టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఎంతో ఘనంగా జరిగింది. మంచు మనోజ్, సునీల్ చలమలశెట్టి ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కి  తమ శుభాకాంక్షలు అందించారు. . 


ఈ వేదికపై మంచు మనోజ్ మాట్లాడుతు సినిమా పరిశ్రమకి కులం, గోత్రం అనేవి ఉండవు.  మతం అసలే లేదు! సినిమా తీసే వాళ్లకు, థియేటర్లలో ఆదరించే ప్రేక్షకులకు, అలాగే వార్తలని  మోసుకెళ్లే మీడియా సోదరులకి ... మనందరికీ ఉన్నది ఒకటే కులం, అది సినిమా కులం!   జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలంటే ప్రతి ఒక్కరూ ధైర్యంగా రిస్క్ తీసుకోవాలి. అలాగే తీసుకున్న నిర్ణయంపై సంపూర్ణమైన నమ్మకంతో కష్టపడి పని చేయాలి. ఈ చిత్రంలోని  సతీష్ జై ఒకేసారి హీరోగా, దర్శకుడిగా మరియు నిర్మాతగా త్రిపాత్రాభినయం తరహాలో 3 కీలక బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఒక కొత్త టీమ్‌ని నడిపిస్తూ ఇలాంటి సాహసోపేతమైన ప్రయత్నం చేయడానికి సతీష్ జై చూపించిన తెగింపు, పట్టుదల అభినందనీయం. అంతేకాకుండా, ఈ చిత్రానికి స్వరాలు అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ గారితో నాకు ఎంతో అనుబంధం ఉంది. నా  తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నుంచి వచ్చిన  'రాయలసీమ రామన్న చౌదరి' కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను.ఆ సమయంలో ఆయన  అందించిన ఐకానిక్ టైటిల్ సాంగ్ కంపోజిషన్‌ను దగ్గరుండి చూసే అరుదైన అవకాశం లభించింది. ఇటీవల మణిశర్మ సంగీతం అందించిన 'చెన్నై లవ్ స్టోరీ' మంచి విజయాన్ని సాధించిందని, అదే విజయ పరంపరను ఈ 'గజ' సినిమాతో కూడా కొనసాగించాలని మనోజ్ ఆకాంక్షించారు. 


Also read: సంచలన నిర్ణయం: ఆ ఇన్స్టాగ్రామ్ పేజీకి సినిమా టికెట్ పంపించండి.. డబ్బులు తీసుకోండి
 
 సతీష్ జై మరియు ఫర్నాజ్ శెట్టి జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అనేక 'వావ్ ఫ్యాక్టర్స్' ఉన్నాయని, కచ్చితంగా అందరికీ నచ్చేలా రూపొందించామని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది. సంచలన వ్యాఖ్యలు మరియు అద్భుతమైన టీజర్‌తో ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నిలిచిన 'గజ' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి ఘన విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా గ్రాండ్‌గా విడుదలవుతున్న ఈ చిత్రంపై మొదటి నుంచీ సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది

 Manchu Manoj, Gaja teaser launch, Tollywood
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com