TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

మా నాన్న దేవుడు..క్షమించండంటూ మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు 

Dec 11, 2024 10:34AM

మోహన్ బాబు(mohan babu)నిన్న జల్లేపల్లి లోని తన ఇంటి దగ్గరకి వచ్చిన మీడియా వాళ్ళతో అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ఒక మీడియా పర్సన్ దగ్గర మైక్ లాక్కొని దాంతోనే అతని చెవి మీద కొట్టడంతో సదరు జర్నలిస్ట్ ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు.ఈ సంఘటనతో తెలంగాణ జర్నలిస్ట్ ల ఫోరమ్ మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉంది.

 ఇప్పుడు ఈ విషయంపై మనోజ్(manchu manoj)మీడియాతో మాట్లాడుహతు మా నాన్న, అన్న చేసిన దానికి సారీ మీకెప్పుడు నేను అండగా ఉంటాను, ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు అందుబాటులో ఉంటాను నాకు సపోర్ట్ చెయ్యడానికి వచ్చి మీకు ఇలా జరగడం చాలా బాధగా ఉంది.మా నాన్న తరుపున నేను క్షమాపణలు  కోరుతున్నాను.మా నాన్న దేవుడు.ఈ రోజు ఏదైతే చూస్తున్నారో అది మా నాన్న కాదు.ఇదంతా వినయ్ వాళ్ళు చేస్తున్నారు.నేను అబద్దాలు ఆడే వాడ్ని కాదు.నా గురించి ఎవరినైనా అడిగితే ఈ విషయం చెప్తారు.
 మా ఆవిడ తన ఇంట్లో గాని,నేను మా ఇంట్లో గాని ఎలాంటి డబ్బులు గాని ఆస్తులు గాని  అడగలేదు,

పది కార్లున్న మా ఇంటికి మొన్న నైట్ 108 అంబులెన్సు మా ఇంటికి వచ్చింది.పోలీసులకి కూడా  ఈ విషయం తెలుసు.ప్రతిదీ నేను చేస్తున్నా అంటున్న వాళ్ళు సీసీ కెమెరాలు చెక్ చేస్తే అసలు విషయం తెలుస్తుంది.పసి పిల్ల అయిన నా కూతురు జోలికి వినయ్ అనే వాళ్ళు వచ్చారు.అప్పుడు భయపడి పోలీసులకి చెప్పాను.అసలు ఈ గొడవలన్నీ ఎందుకు వచ్చాయో ఈ రోజు ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం మాట్లాడతానని చెప్పుకొచ్చాడు. 


 

google-ad-img