Home

»

Latest News

మమితా బైజు: ఆ కోరిక తీరేదెప్పుడు!

Sep 25, 2026 6:28PM

 


 

నటన విషయంలో, స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో నాకు, మిగతా హీరోయిన్స్ కి సమ్ థింగ్ డిఫరెన్స్ ఉంది కదు అని విశ్వనాధ్ అండ్ సన్స్,  'బెత్లెహోం కుటుంబ యూనిట్' తో నిరూపించింది మమితా బైజు. అంతే కాదు తక్కువ వ్యవధిలోనే స్టార్ డమ్ సంపాదించిన నటీమణిగా సినీ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. పైపెచ్చు కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 1000 కోట్ల బాక్సాఫీస్ రికార్డు కూడా తనదే.  


మలయాళంతో పాటు తమిళంలో వరుసగా పట్టిందల్లా బంగారమవుతున్నా, మమితా బైజు దృష్టి మాత్రం పూర్తిగా తెలుగు సినిమా పైనే ఉందనే వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. పైగా తెలుగు సినిమా చేయాలనేది కూడా తన ఆశ, కోరిక, లక్ష్యం అని కూడా టాక్. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. దక్షిణాదిలో గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్న మమితా చేతిలో ప్రస్తుతం వరుస ఆఫర్లు ఉన్నప్పటికీ, నేరుగా ఒక్క తెలుగు స్ట్రెయిట్ ప్రాజెక్ట్ కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టాలీవుడ్ మేకర్స్ ఈ చిన్నదాని గ్లామర్ అండ్ యాక్టింగ్ టాలెంట్‌ని  ఎందుకు పట్టించుకోవడం లేదనే చర్చ మొదలైంది. 

 


ఇది కూడా చదవండి: బాలీవుడ్ లో ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్ కెరీర్ ముగిసినట్లేనా!


టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈ భామను స్టార్ హీరోల సరసన కేస్టింగ్ చేసేందుకు కొంత సందేహిస్తున్నారని సమాచారం. ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ లేదా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్ రాసుకుంటే మమిత మొదటి ఆప్షన్‌గా నిలుస్తోంది. ఎందుకంటే 'విశ్వనాథ్ అండ్ సన్స్'లో సూర్యతో 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంటే, మలయాళ హిట్ 'బెత్లెహోం కుటుంబ యూనిట్'లో హీరో హీరోయిన్ క్యారెక్టర్ల మధ్య 12 ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఇలాంటి భిన్నమైన పాత్రల్లో ఆమె నటనతో మెప్పించినప్పటికీ, తెలుగు మేకర్స్ మాత్రం ఇంకా ఆలోచనలోనే ఉన్నారు.  మరోవైపు రెమ్యునరేషన్ విషయంలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. మలయాళ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లకు కోటి లోపే పారితోషికం లభిస్తుంది. అదే మన దగ్గర  మంచి ఆఫర్ వస్తే కోటి రూపాయలేంటి?  2 కోట్ల వరకైనా ఇస్తారు..కానీ, ఇప్పటివరకు తెలుగు అవకాశమే తలుపు తట్టకపోవడం గమనార్హం. మరి త్వరలోనే తెలుగు సినీ డోర్ ఓపెన్ అవాలని కోరుకుందాం.

 

[Mamitha Baiju Struggling For Tollywood Offers, Mamitha Baiju, 1000 crore box office club, Telugu Cinema, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com