Home

»

Latest News

'జై హనుమాన్’తో మమితా బైజు మైథాలజీ ఎంట్రీ?

Oct 8, 2026 5:16PM


ఒక్కొక్కరికి ఒక్కో టైం అన్నట్టుగా ఇప్పుడు ఆ టైం మమితా బైజు చుట్టూ జీ హుజూర్ అంటూ తిరుగుతుంది. దీంతో సౌత్ హీరోలు, మేకర్స్ తన గురించే ఆలోంచించే పరిస్థితి.  కాలు కదిపితే కోట్ల రూపాయల వసూళ్లు. అలాంటి ఈ క్రేజీ భామ  ఇప్పుడు ఏకంగా బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుండడం సినీ వర్గాల్లో  ఆసక్తి రేకెత్తిస్తోంది.

దర్శకుడు ప్రశాంత్ వర్మ సృష్టించిన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) లో భాగంగా వచ్చిన ‘హను-మాన్’ చిత్రం దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ భారీ విజయానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న సీక్వెల్ ‘జై హనుమాన్’. ఈ భారీ మైథలాజికల్ విజువల్ వండర్‌లో కాంతార ఫేమ్ రీసెంట్ నేషనల్ అవార్డ్ విన్నర్ రిషబ్ శెట్టి కథానాయకుడిగా, శ్రీరాముడి భక్తుడైన హనుమంతుడిగా  కనిపిస్తున్నారు. ప్రశాంత్ వర్మ విజన్, రిషబ్ శెట్టి కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ నుంచే ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలోనే హీరోయిన్ రోల్  కోసం మమితా బైజుని ఎంపిక చేసినట్లు ఆండస్ట్రీ వర్గాల్లో గట్టిగానే ప్రచారం జరుగుతోంది.

 


ఇది కూడా చదవండి: వాళ్ళని ప్రస్తావిస్తూ డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు: టాలీవుడ్‌లో మరో సంచలనం!

తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎక్కువగా యూత్‌ఫుల్, రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌లో మెరిసిన మమితా బైజుకి ఇది మొదటి మైథలాజికల్ ప్రాజెక్ట్ కావడం విశేషం. దీంతో మరో సారి తనదైన శైలిలో నటనను కనబరిచి పాన్ ఇండియా స్థాయిలో మరింత పాపులారిటీ సాధించే అవకాశం ఉంది. అయితే అధికార ప్రకటన రావాలి. అప్పటివరకు రూమర్  మమితా బైజు ని దాచుకొని ఫోజు కొడుతూనే ఉంటుంది.

 

Mamitha Baiju In Jai Hanuman Movie, Mamitha Baiju, Jai Hanuman, Prasanth Varma, Rishab Shetty, Premalu Heroine, Jai Hanuman Cast Update, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com