Home

»

Latest News

ఆ హీరోకి నేనంటే పిచ్చి.. ఎంత పని చేసావు మల్లికా

Aug 12, 2026 1:00PM


వైరల్ కి పేటెంట్ హక్కు పొందిన బాలీవుడ్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ భామ మల్లికా షెరావత్ 'మర్డర్', 'ఖ్వాహిష్' వంటి సినిమాలతో  కుర్రకారు గుండెల్లో మంటలు రేపి సినిమా చూసే వాళ్ళ సంఖ్యని పెంచింది.సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ భారతీయ డిజిటల్ స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమైంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'ది ట్రేటర్స్ సీజన్ 2' (The Traitors Season 2) ద్వారా ఆమె మళ్లీ ఓటీటీ ప్రేక్షకులను అలరించబోతోంది. 


ఆగస్టు 13, 2026 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) అత్యంత వైభవంగా స్ట్రీమింగ్ కానున్న ఈ షో, విడుదలకు ముందే  క్రేజ్ సంపాదించుకుంది. మొత్తం 21 మంది ప్రముఖ సెలబ్రిటీ పోటీదారులు పాల్గొంటున్న ఈ గేమ్‌షోలో మైండ్ గేమ్‌లు, విద్రోహాలు, వ్యూహాలు ప్రధానాకర్షణగా నిలవనున్నాయి. అయితే ఈ షో ప్రోమో మరియు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో క్లిప్ లో మల్లికా చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.  'ది ట్రేటర్స్' హౌస్ లో ఉన్నప్పుడు మల్లికని తోటి పోటీదారుడైన ప్రముఖ కమెడియన్ ఆదిత్య కులశ్రేష్ఠ సరదాగా ఒక ప్రశ్న అడిగాడు. "మల్లికా జీ, మీకు ఎప్పుడైనా ఎవరిపైనా క్రష్ (Crush) కలిగిందా? లేక అందరూ మీపైనే మోజు పడతారా?" అని కుల్లు అడిగిన ప్రశ్నకు మల్లికా షెరావత్ స్పందిస్తూ నాకు ఎవరిపైనా క్రష్ ఉండదు. ఎప్పుడూ అందరికీ నాపైనే క్రష్ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో హాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, 'మిషన్: ఇంపాజిబుల్' (Mission: Impossible) సిరీస్ ఫేమ్ టామ్ క్రూజ్ (Tom Cruise) కు కూడా నాపై తీవ్రమైన క్రష్ ఏర్పడింది. నేను అబద్ధం చెప్పడం లేదు, నా దగ్గర ఇప్పుడు ఫోన్ ఉండి ఉంటే, ఆయన నాకు పంపిన ప్రైవేట్ వీడియోలు మరియు మెసేజ్‌లు మీకు చూపించేదాన్ని" అని చెప్పి హౌస్ మేట్స్‌తో పాటు ప్రేక్షకులందరికీ పెద్ద షాక్ ఇచ్చింది.  ఈ మాటకు తోటి పోటీదారులు  ఆశ్చర్యపోతూ "ఆయన మీకు ఎలాంటి వీడియోలు పంపుతున్నారు? స్నాప్‌లు పంపుతున్నారా?" అని ఆరా తీశారు. దానికి మల్లికా నవ్వుతూ "లేదండి, అవి స్నాప్‌లు కావు! మేముద్దరం కలిసి గ్రాండ్ గా పార్టీలు చేసుకున్నప్పటి వీడియోలు. ఆయన చాలా గ్రేట్, అద్భుతమైన వ్యక్తి" అని వెల్లడించింది.  

Also read: సమరం: తప్పదా డార్లింగు 

Mallika Sherawat, Tom Cruise

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com