Home

»

Latest News

మాళవిక మోహన్ ఆసక్తికర ట్వీట్: అతను ఎంతో ప్రత్యేకం

Oct 3, 2026 2:27PM


సినీ ప్రేమికుల హార్ట్ బీట్ లో ఒకరిగా మారింది మాళవిక మోహనన్. రాజాసాబ్ తో ఆకట్టుకున్న ఈ భామ రీసెంట్ గా 'సర్దార్ 2 'లో ప్రాధాన్యత గల క్యారక్టర్ తో మెప్పించింది. ప్రస్తుతం విజయ్‌ సేతుపతితో ‘పాకెట్‌ నోవెల్‌’ చేసి ఫలితం కోసం ఎదురుచూస్తూ ఉంది. 

మాళవిక మోహనన్ రీసెంట్ గా 'ఎక్స్' వేదికగా' విజయ్ సేతుపతితో పనిచేయడం నా జీవితంలో అత్యంత మరపురాని, అందమైన అనుభవం. సెట్స్‌లో ఆయన చూపించిన ఆప్యాయత, తోటి నటీనటులకి  ఇచ్చే గౌరవం, ప్రతీ సన్నివేశంలో అందించే ప్రోత్సాహం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా "ఆయన అత్యంత శ్రద్ధ కలిగిన, ఉదార మనస్కుడు. ఆయన కాకుండా ఈ ప్రయాణాన్ని మరొకరితో ఊహించుకోలేను.

ఇది కూడా చదవండి:  ప్రకాష్ రాజ్ సంచలన పిలుపు 

 

 

షూటింగ్‌ అనేది కేవలం కెమెరా ముందు నటించడం మాత్రమే కాదు. ఒక బృందంతో కలిసి నెలల తరబడి ప్రయాణించడం, వారితో ఎన్నో అనుభవాలని పంచుకోవడం కూడా అందులో భాగమే. కొన్ని సినిమాలు చేస్తున్న సమయంలో ఆ చిత్ర బృందమే ఒక ప్రత్యేకమైన ప్రపంచంలా మారిపోతుంది.  పాకెట్‌ నోవెల్‌ కూడా నాకు అలాంటి అనుభూతినే ఇచ్చిందని చెప్పింది. 


 

[Malavika Mohanan Comments On Vijay Sethupathi, Malavika Mohanan Latest Tweet, Vijay Sethupathi, Pocket Novel, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]

 

 

 

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com