Home

»

Latest News

డీసీ మూవీ చూసిన మహేష్ బాబు.. ఎక్స్ వేదికగా షాకింగ్ రిప్లై

Aug 17, 2026 4:08PM

 

ఎన్ని సినిమా న్యూస్ వచ్చినా సైట్స్, సోషల్ మీడియాకి రాని 'కళ' మహేష్ బాబు న్యూస్ వస్తే మాత్రం ఆయా సైట్స్, సోషల్ మీడియాకి కళ తో పాటు అదనపు శోభని తెచ్చిపెడుతుంది. తాజాగా మహేష్ బాబు  లోకేష్ కనగరాజ్ హీరోగా వచ్చిన భారీ యాక్షన్ క్రైమ్ డ్రామా 'డీసీ' చిత్రాన్ని వీక్షించి, సోషల్ మీడియా వేదికగా తన రివ్యూను పంచుకున్నారు. 

మహేష్ బాబు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. 'డీసీ' అత్యంత వినూత్నమైన, అద్భుతమైన సినిమా. సినిమా ప్రెజెంటేషన్ చాలా కూల్‌గా అనిపించింది.  ప్రతి సన్నివేశాన్ని, ప్రతి చిన్న అంశాన్ని ఎంతగానో ఆస్వాదించాను. చిత్ర బృందానికి నా  హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ మహేష్  చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మహేష్ బాబు నుంచి వచ్చిన ఈ ఊహించని ప్రశంసలపై దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ మరియు సంగీత దర్శకుడు అనిరుధ్ స్పందిస్తూ సూపర్ స్టార్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


Also Read: దిల్ రాజు లాంటి నిర్మాత మళ్లీ ఎందుకు రాలేదు.. వస్తాడా! వస్తే ఎప్పుడు!


ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్  25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన డిసి విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 84 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి, దేశీయంగా రూ. 50.26 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ఇది రూ. 100 కోట్ల క్లబ్ దిశగా శరవేగంగా దూసుకెళ్తుండడం గమనార్హం.  అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించగా, శరత్ చంద్ర చటోపాధ్యాయ రాసిన క్లాసిక్ నవల 'దేవదాస్' స్ఫూర్తితో నేటి క్రైమ్ యాక్షన్ నేపథ్యానికి అనుగుణంగా దీనిని తీర్చిదిద్దారు. నటుడిగా మొదటి అడుగు వేసిన లోకేష్ కనగరాజ్ తన పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, నటనతో దేవదాస్ పాత్రలో జీవించారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. కథానాయికలుగా వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి నటన చిత్రానికి ప్రధాన పిల్లర్లుగా నిలిచాయి. ఇక రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ డార్క్ యాక్షన్ మూవీకి ప్రాణం పోశాయి. 

Mahesh Babu, Dc, Lokesh kanagaraj, Tollywood

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com