
-సోషల్ మీడియాని హీట్ ఎక్కిస్తున్న మహేష్ తాజా న్యూస్
-హిట్ ఫ్రాంచైజీ ధూమ్ సిరీస్ లో సూపర్ స్టార్
-మహేష్ ఓకే చెప్పాడా!
వారణాసితో వరల్డ్ సెల్యులాయిడ్ పై మహేష్ సృషించబోయే సునామీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చాలా క్లియర్ గా అర్ధమవుతుంది. ఈ చిత్రం తర్వాత మహేష్ ఒకే చెప్పబోయే ప్రాజెక్ట్స్ గురించి పలు వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు తాజా హోదాలో వినిపిస్తున్న న్యూస్ ఇండియన్ సినీ సర్కిల్స్ లో ప్రధాన హాట్ టాపిక్.
బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీ ధూమ్ సిరీస్. ఇప్పటి వరకు మూడు భాగాలు వచ్చాయి. ఎవిరీ పార్ట్ సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు ధూమ్ 4 పట్టాలెక్కపోబోతుంది. ఈ ధూమ్ పార్ట్ 4 లోనే మహేష్ జాయిన్ కాబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రధాన పాత్ర కోసం మహేష్ బాబుని సంప్రదించారని, మహేష్ కూడా సానుకూలంగా స్పందించాడని అంటున్నారు. దీంతో మహేష్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
ఇది కూడా చదవండి: 'ఆదర్శ కుటుంబం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

వాళ్లంతా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ 'స్టైలిష్ లుక్, స్వాగ్, యాక్షన్‌తో ఆకట్టుకునే మహేష్ ధూమ్ 4 ఫ్రాంచైజీలో భాగమైతే సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరడం ఖాయమనే చర్చ జరుగుతోంది. మరి ధూమ్ 4 లో మహేష్ ఉన్నాడనే న్యూస్ నిజమైతే ఫ్యాన్స్ చెప్పేది జరగడం అనేది పక్కా. అయితే మహేష్ చాలా సందర్బాలలో తన ప్రాధాన్యం తెలుగు సినిమాకే అని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
[Mahesh Babu In Dhoom 4, Mahesh Babu, Dhoom 4, Yash Raj Films, Tollywood news, Bollywood offer, Superstar Mahesh Babu about Varanasi Movie, Telugu Cinema, Tollywood, Telugu News, Tollywood News]






