Home

»

Latest News

నాకు 35 ఏళ్ళు పట్టింది: రష్మిక పై మధుబాల కీలక వ్యాఖ్యలు! 

Oct 26, 2026 2:30PM

మూడున్నర దశాబ్దాల క్రితమే పరువం వానగా నేడు కురిసేనులే'  అంటూ 'రోజా' మూవీతో యావత్తు భారతీయ చిత్ర పరిశ్రమని,ప్రేక్షకులని తన వైపు చూసేలా చేసిన హీరోయిన్ మధుబాల. ఆ తర్వాత హిందీ చిత్ర  సీమలో తన సత్తా చాడటంతో పాటు 'అల్లరిప్రియుడు' జెంటిల్ మెన్ వంటి చిత్రాలతో తెలుగు వారి అభిమాన నటిగా కూడా మారింది. రీసెంట్ గా మధుబాల పాన్ ఇండియా హీరోయిన్ టాగ్ లైన్ తో దూసుకుపోతున్న రష్మిక మాట్లాడే  హిందీ  యాస గురించి జరుగుతున్న ట్రోల్ల్స్ పై  మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది డే హోదాని సంపాదించాయి.

మధుబాల ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తు  'రష్మిక తన యాసని చూసి భయపడకుండా, నవ్వుతూ  అంగీకరించిన విధానం నాకు నచ్చింది "నువ్వు ఒక సౌత్ ఇండియన్ వి. నీకు సౌత్ ఇండియన్ యాస ఉంది.. ఇందులో సిగ్గుపడాల్సింది ఏముంది? నువ్వు ఒక అసలైన స్టార్, గర్వంగా ముందుకు సాగు" అంటూ మధు రష్మికకు తన పూర్తి మద్దతును ప్రకటించారు. సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన నాటి నుంచి తన నటన, భాష, యాసపై వస్తున్న విమర్శలన్నింటినీ లెక్కచేయకుండా, అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలనే తన లక్ష్యానికి రష్మిక కట్టుబడి ఉండటం అద్భుతమని మధు కొనియాడారు. '

ఇదే సమయంలో మధు తన గత జ్ఞాపకాలను, కెరీర్ తొలినాళ్ల అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు తన హిందీ ఉచ్ఛారణలో చిన్నపాటి యాస బయటపడితే  ఎంతో కంగారుపడేదానిని. ఉత్తరాది వారిలాగే మాట్లాడటానికి ఎంతో శ్రమించేదానని తెలిపారు. కానీ నేడు తాను ఒక సౌత్ ఇండియన్‌గా ఎంతో గర్వపడుతున్నానని, తన హిందీలో కాస్త సౌత్ ఇండియన్ టచ్ ఉన్నా ఇప్పుడు తాను ఏమాత్రం ఇబ్బందిపడనని స్పష్టం చేశారు. అయితే తన వ్యక్తిగత జీవితంలో ఈ ఆత్మవిశ్వాసాన్ని, పరిపక్వతను సంతరించుకోవడానికి ఏకంగా 30 నుంచి 35 సంవత్సరాల సుదీర్ఘ కాలం పట్టిందని మధు వెల్లడించారు.


ఇది కూడా చదవండి: త్రిష రాజకీయరంగ ప్రవేశం: మీడియాతో రాజకీయాలపై త్రిష ఏం మాట్లాడిందంటే!

 

 

ప్రముఖ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' సీజన్ 9లో రష్మిక పాల్గొన్న తర్వాత, ఆమె హిందీ ఉచ్ఛారణపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అనవసరమైన ట్రోల్స్‌కు పాల్పడ్డారు. అయితే ఈ విమర్శలను రష్మిక చాలా సానుకూలంగా, ఎంతో మెచ్యూరిటీతో తిప్పికొట్టారు. తాను దక్షిణాదికి చెందిన వ్యక్తినని, కాబట్టి తన మాట్లాడే విధానంలో సౌత్ ఇండియన్ యాస ఉండటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని, దానిని తాను గర్వంగా స్వీకరిస్తానని  తేల్చిచెప్పారు. రష్మిక చూపిన ఈ ఆత్మవిశ్వాసాన్ని స్టార్ రైటర్ జావేద్ అక్తర్ లాంటి వాళ్ళు కూడా సమర్థిస్తున్నారు. ఆయన అయితే ఏకంగా హిందీ వాళ్ళు కూడా మిగతా భాషలు యాస లేకుండా మాట్లాడాలని సవాలు విసిరాడు.

 

 

[Madhoo comes out in support of rashmika over south indian accent criticism, Madhoo Comes out in support of Rashmika Hindhi language, Rashmika Mandanna, Madhoo about Rashmika, Telugu Cinema, Tollywood, Telugu News, Tollywood News]
 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com