Home

»

Latest News

విదేశీ రియాలిటీ షో హోస్ట్ గా మాధవన్! ఆ 'షో' ఎలా జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు 

Oct 5, 2026 4:38PM


ధురంధర్ సిరీస్ లో రియల్ ఇండియన్ ఇంటెలిజెన్స్  చీఫ్  'అజిత్ దోవల్' క్యారక్టర్ లో ఇంచు కూడా జీవం తగ్గకుండా జీవించి మెప్పించాడు మాధవన్. దీంతో తను ఎంత వాల్యుబుల్ నటుడో మరోసారి చాటి చెప్పినట్లయింది. మాధవన్‌ ఇప్పుడు ఒక కొత్త అవతారంలో అభిమానులు, ప్రేక్షకులని  పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. 

 ఒక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బిజినెస్ రియాలిటీ షోకి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. 'ఆప్టిమిస్టిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా లిమిటెడ్' (Optimystix Entertainment) సంస్థ నిర్మిస్తున్న ఈ సరికొత్త ఇన్నోవేటివ్ షో పేరు 'గేమ్‌ చేంజర్స్‌' (Game Changers). ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగంలో దూసుకుపోతున్న స్టార్టప్‌ వ్యవస్థాపకులని , పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం.   ఈ 'గేమ్‌ చేంజర్స్‌' కార్యక్రమానికి దుబాయ్ నగరం ప్రధాన నిర్మాణ కేంద్రంగా (Production Hub) వ్యవహరించనుంది. 


ఇది కూడా చదవండి: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'' డిజాస్టర్ అయ్యిందా! రాజమౌళి, కార్తికేయ బ్రాండ్‌కి తగిలిన షాక్!

 

మిడిల్ ఈస్ట్ మార్కెట్‌ని  లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తున్న ఈ బిజినెస్ రియాలిటీ షోలో ప్రపంచంలోని వివిధ మూలల నుంచి ఎంపిక చేసిన ప్రతిభావంతులైన స్టార్టప్ ఫౌండర్లు పాల్గొంటారు. దుబాయ్, లండన్, రష్యా మరియు యునైటెడ్ స్టేట్స్ (US) వంటి 4 ప్రధాన అంతర్జాతీయ ప్రాంతాలకు చెందిన దిగ్గజ ఇన్వెస్టర్ల ప్యానెల్ ముందు ఈ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ తమ వ్యాపార ఐడియాలను, ఆవిష్కరణలను పిచ్ చేయనున్నారు. కేవలం నిధుల సమీకరణ మాత్రమే కాకుండా, వ్యాపార నిర్మాణంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు, ఆశయాలు, వ్యూహాత్మక ఆలోచనలు మరియు వారి వెనుక ఉన్న భావోద్వేగపూరితమైన నిజ జీవిత కథలను కూడా ఈ షో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.  

 

 

[Madhavan To Host Game Changers Show,R Madhavan Game Changers, Madhavan business reality show, Game Changers Dubai, Optimystix Entertainment, Telugu Cinema  News, Telugu cinema, Tollywood News, Tollywood]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com