
సమంత(Samantha)దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 'మా ఇంటి బంగారం'(తో వెండితెరపైకి గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఇవ్వడమే కాదు రికార్డుల వర్షం కురిపిస్తుంది. సంప్రదాయబద్ధమైన గృహిణి క్యారక్టర్ లో కనిపిస్తూనే, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పాత గతాన్ని తవ్వి తీసే మాస్ యాక్షన్ అవతారంలో ప్రదర్శించిన సమంత పెర్ఫార్మ్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కేవలం 10 రోజుల్లోనే ఏకంగా 80.87 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులని సృష్టిస్తోంది. రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని త్రిలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు మరియు హిమాంక్ రెడ్డి దువ్వురు సంయుక్తంగా నిర్మించారు.
థియేటర్లలో ఘన విజయం సాధించి దూసుకుపోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకి వచ్చింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' డిజిటల్ రైట్స్‌ని భారీ ఫ్యాన్సీ ధరకి దక్కించుకుంది. సాధారణంగా టాలీవుడ్ లో పెద్ద సినిమాల థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు నుండి ఆరు వారాల విండో పాటిస్తుంటారు. ఈ లెక్కన చూసుకుంటే, థియేట్రికల్ రన్ విజయవంతంగా ముగిసిన తర్వాత జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో మా ఇంటి బంగారం ప్రీమియర్ కానుందనేది టాక్.అయితే దీనిపై మేకర్స్ లేదా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి ఆపరేషన్.. బండ్ల గణేష్ ఎమోషనల్ పోస్ట్
మరోవైపు శాటిలైట్ హక్కులని ప్రముఖ టెలివిజన్ ఛానల్ 'స్టార్ మా' (Star Maa) దక్కించుకుంది. ఓటీటీ విడుదల పూర్తయిన తర్వాత ఏదైనా ఒక పండుగ లేదా ప్రత్యేక వీకెండ్ స్లాట్‌లో బుల్లితెరపై సందడి చేయనుంది. సంతోష్ నారాయణన్ అద్భుతమైన సంగీతం, ఓం ప్రకాష్ పవర్‌ఫుల్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం తమిళంలో 'ఎంగళ్ తంగమ్' పేరుతో విడుదలై అక్కడ కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఈ నెల 19 న రిలీజైన మా ఇంటి బంగారంకి నందినీరెడ్డి దర్శకురాలనే విషయం తెలిసిందే.





