Home

»

Latest News

'మా ఇంటి బంగారం' ఫస్ట్ రివ్యూ.. సమంత మ్యాజిక్ చేసిందా?

Jun 17, 2026 11:18AM

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మించిన మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram). దాదాపు మూడేళ్ల విరామం తర్వాత వెండితెరపై సమంత అలరించబోతున్న చిత్రం కావడంతో టాలీవుడ్ ప్రేక్షకులలో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ చిత్రం జూన్ 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్‌తో పాటు సమంత అభిమానుల్లో సరికొత్త జోష్ నెలకొంది.

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 'యు/ఎ' (UA 13+) సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే.. 2 గంటల 34 నిమిషాల 30 సెకన్ల (సుమారు 154 నిమిషాలు) పక్కా నిడివితో లాక్ చేయబడింది. ఎక్కడా బోర్ కొట్టకుండా, కథా గమనానికి సరిపోయేలా ఈ డీసెంట్ రన్ టైమ్‌ను లాక్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో ఎక్కడా అనవసరమైన వివాదాస్పద అంశాలు లేకపోవడంతో బోర్డు సభ్యులు పెద్దగా కట్స్ ఏవీ విధించకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వినోదంతో పాటు సాలిడ్ యాక్షన్ ఎమోషన్స్‌ను పండించిన విధానాన్ని చూసి సెన్సార్ సభ్యులు డైరెక్టర్ నందినీ రెడ్డి మరియు టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా రజనీకాంత్ ఆల్‌టైమ్ క్లాసిక్ హిట్ 'బాషా' ఫార్మాట్ తరహాలో నడుస్తుందని డైరెక్టర్ బి.వి. నందినీ రెడ్డి హింట్ ఇచ్చారు. సాధారణంగా మగ హీరోలతో చూసే ఈ 'ఫ్లాష్‌బ్యాక్ అండ్ సీక్రెట్ పాస్ట్' టెంప్లేట్‌ను కాస్త మార్చి, ఒక సాధారణ గృహిణి స్థానంలో ఉంచి కథను అద్భుతంగా డిజైన్ చేశారు. కొత్తగా పెళ్లై అత్తగారింట్లో అడుగుపెట్టిన ఒక అమాయకపు కోడలు, తన గతాన్ని దాచిపెడుతూ అందరి మనసులు ఎలా గెలుచుకుంది? అదే సమయంలో పాత శత్రువులు తన ఫ్యామిలీపై దాడికి దిగినప్పుడు, వంటింట్లో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ పట్టి వారిని ఎలా వేటాడింది? అనే కథాంశంతో సినిమా రొమాంచితంగా సాగుతుంది.

ఇక 'మా ఇంటి బంగారం' ఇన్‌సైడ్ సెన్సార్ టాక్ ప్రకారం.. సినిమాలో సమంత పెర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉందట. ముఖ్యంగా చీరకట్టులో ఆమె చేసిన హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమని అంటున్నారు. సమంతతో పాటు సహ నటీనటులైన శ్రీముఖి, గౌతమి, గుల్షన్ దేవయ్య, మంజూష తమ పాత్రలకు 100 శాతం న్యాయం చేశారు. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని, ప్రతి ఫైట్ సీన్‌లో థియేటర్లు దద్దరిల్లడం గ్యారెంటీ అని టాక్. సమంత తన సొంత బ్యానర్ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్ పై తన భర్త రాజ్ నిడిమోరు మరియు హిమాంక్ దువ్వూరుతో కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com