Home

»

Latest News

ఓటీటీలోకి డైరెక్ట్‌గా మీ అభిమాన రొమాంటిక్ మూవీ: తెలుగుతో పాటు 19 భాషల్లో స్ట్రీమింగ్!

Oct 14, 2026 3:57PM

 

రొమాంటిక్ జోనర్ ని ఇష్టపడని ప్రేక్షకుడు ఉండడు. అంతలా ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడి  హృదయాన్ని టచ్ చేస్తాయి. ఆ కోవలోనే నిర్మాణం జరుపుకున్న చిత్రం 'లవ్ ఆఫ్ యువర్ లైఫ్'. ప్రముఖ హాలీవుడ్ నటి మార్గరెట్ క్వాలీ  'మాయ' (Maya) అనే క్యారక్టర్ లో   కనిపించగా, గాబ్రియేల్ బాస్సో 'చార్లీ' (Charlie) గా కనువిందు చేసాడు.

ఈ చిత్రం డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ రోజు అంటే అక్టోబర్ 14,నుంచి గ్లోబల్ ప్రేక్షకులకి  అందుబాటులోకి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తెలుగు కాకుండా 19 భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజైన మూవీ కూడా. రన్‌టైమ్‌ 1 గంటా 46 నిమిషాలు. కథ విషయానికి వస్తే, మాయ మరియు చార్లీ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటూ తమ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటారు. అయితే, ఊహించని ఒక సంఘటన వారి జీవితాలను తలక్రిందులు చేస్తుంది. ఆ తరువాత మాయ తన జీవితాన్ని మొదటి నుంచి ఎలా పునర్నిర్మించుకుంది? ప్రేమ అంటే ఏమిటి? తన ఉనికిని చాటుకోవడానికి ఆమె పడ్డ సంఘర్షణ ఏమిటి? అనే ప్రశ్నలకు అందమైన సమాధానమే ఈ చిత్రం. ముఖ్యంగా ప్రియమైన వారిని కోల్పోయిన తర్వాత వచ్చే శూన్యతని , జీవితంపై కొత్త ఆశను దర్శకురాలు రేచల్ మోరిసన్  చాలా రియలిస్టిక్‌గా చూపించారు. 

ఇది కూడా చదవండి: స్టార్ క్యాస్ట్ లేదు: గ్లామర్ పాటలు లేవు..ప్రస్తుతం 70 కోట్ల కలెక్షన్స్.. ఓటిటిలోకి వచ్చేస్తుంది! 

 

 


 వీకెండ్‌లో మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ చూడాలనుకునే వారికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఒక చక్కటి అనుభూతిని పంచుతుంది. ఈ చిత్రానికి మరో విశేషం ఏమిటంటే, ఆస్కార్ నామినీ ప్రముఖ నటుడు ర్యాన్  గోస్లింగ్ (Ryan Gosling)  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం విశేషం.

 

[love Of Your Life Ott Release Date, Love of Your Life movie, Amazon Prime Video streaming, Margaret Qualley, Aaron Pierre, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

 


     
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com