వాలెంటైన్స్ డేను బ్లడీ వాలెంటైన్‌గా మార్చిన లోకేష్!
on Feb 14, 2026
దక్షిణాదిలో ఉన్న టాప్ డైరెక్టర్స్‌లో లోకేష్ కనకరాజ్ ఒకరు. చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో ఆయన చేసే సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్ప్పుడు డైరెక్షన్ నుంచి యాక్టింగ్ వైపు వెళుతున్నాడు లోకేష్.
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మిస్తున్న ‘డిసి’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు లోకేష్. అతని సరసన వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తోంది. సమ్మర్ స్పెషల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డార్క్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. తనకు నటనపై ఎంత ప్యాషన్ ఉంది అనేది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. పూర్తి వయొలెంట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో హీరోగా తనేమిటో ప్రూవ్ చేసుకోబోతున్నారు లోకేష్.
రగ్‌డ్‌గా ఉంటే దేవదాసు క్యారెక్టర్ ఈ సినిమాలో చేస్తున్నాడు లోకేష్. ఒక సినిమాలో హీరోగా నటిండం లోకేష్ అభిమానులకు కూడా షాకింగ్‌గానే ఉంది. కేవలం డైరెక్షన్‌కే పరిమితం కాకుండా నటనపై కూడా దష్టి పెట్టడం అందర్నీ ఆకర్షిస్తున్న అంశం. ఈ చిన్న వీడియో గ్లింప్స్‌లో లోకేష్ కనగరాజ్ చాలా హ్యాండ్సమ్‌గా, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. గతంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యామియో రోల్స్ చేసినా, ఈసారి ఒక ఫుల్ లెంగ్త్ పాత్రలో లేదా కీలక పాత్రలో ఆయన నటిస్తున్నట్లు సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



