Home

»

Latest News

lenin: అయ్యగారు ఈ సారి హిట్ అందుకుంటాడా!.. ఆ గండం గట్టెక్కితే కొట్టినట్టే 

Jul 1, 2026 2:22PM

అఖిల్(Akhil)అక్కినేని సూపర్ హిట్ అందుకోవాలని అభిమానులే కాదు, తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. నిన్న రిలీజైన ట్రైలర్ చూస్తుంటే సూపర్ హిట్ అయ్యేలా ఉంది. 2023లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన  'ఏజెంట్'  పరాజయం తర్వాత మూడేళ్ల విరామం తీసుకున్న అఖిల్, ఈసారి ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నాడు. 

ఈ క్రమంలోనే మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన రూరల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా 'లెనిన్' చిత్రంతో జులై 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వైజాగ్ వేదికగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలను పెంచేసింది. అసలు ఈ 'లెనిన్' చిత్రం అఖిల్ కెరీర్‌కి  మొదటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందిస్తుందా లేదా అనే కోణంలో ట్రేడ్ వర్గాలు మరియు సినీ విశ్లేషకులు ఆసక్తికరమైన అంచనాలు వేస్తున్నారు.

ఈ సినిమా హిట్ అవ్వడానికి అత్యంత అనుకూలమైన అంశం అఖిల్ అక్కినేని మేకోవర్ మరియు అతని మునుపెన్నడూ చూడని రగ్గడ్ లుక్. క్లాస్ మరియు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న అఖిల్, ఈ చిత్రంలో చిత్తూరు జిల్లా రాయలసీమ ప్రాంతీయ యాసలో పక్కా మాస్ హీరోగా కనిపించబోతున్నాడు. ట్రైలర్ చూసిన సినీ ప్రియులు అఖిల్ కెరీర్‌లోనే ఇది బెస్ట్ మాస్ ట్రాన్స్‌ఫార్మేషన్ అని ప్రశంసిస్తున్నారు. శ్రీరామాపురం అనే గ్రామంలో జరిగే ద్రౌపదమ్మ 18 రోజుల ఉత్సవాల నేపథ్యంలో, ఒక్క చుక్క రక్తం కూడా చిందకూడదనే కఠినమైన సాంప్రదాయం మధ్య జరిగే ఒక ఊహించని సంఘటన చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన రాజకీయ మిత్రుడు, తన ప్రేయసి ప్రమాదంలో పడినప్పుడు, ఆ హింసను అణచడానికి లెనిన్ అనే యువకుడు ఎలా కత్తి పట్టాడు అనే పాయింట్ మాస్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. క్రేజీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ,అఖిల్ మధ్య    కెమిస్ట్రీ, ఎస్.ఎస్. థమన్ అందించిన హై-వోల్టేజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అతిపెద్ద అస్సెట్‌గా మారాయి. కింగ్ నాగార్జున స్వయంగా సినిమా ఫస్ట్ కట్ చూసి "ఒక కొత్త అఖిల్‌ను చూడబోతున్నారు" అని 11 ముక్కల్లో ఇచ్చిన రివ్యూ అక్కినేని అభిమానుల్లో 100% నమ్మకాన్ని నింపింది.

Also read: Anirudh ravichander: అనిరుద్ రెమ్యునరేషన్ ఇంతే!.. మరి క్యూ కడుతున్నారుగా

అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే కొన్ని సవాళ్లని   అధిగమించాల్సి ఉంటుంది. ఈ చిత్రం మే 1వ తేదీన విడుదల కావాల్సి ఉండగా, రామ్ చరణ్ 'పెద్ది' సినిమా కోసం మరియు ఇతర కారణాల వల్ల రెండు సార్లు వాయిదా పడి చివరకు జులై 10కి ఫిక్స్ అయింది. ఇలాంటి వరుస వాయిదాలు సాధారణంగా సినిమా బజ్‌ను కొద్దిగా తగ్గిస్తాయి. కానీ చిత్ర యూనిట్ ప్రమోషన్లను గట్టిగా చేస్తుండటంతో ప్రస్తుతం నెగటివ్ వైబ్స్ కనిపించడం లేదు. డైరెక్టర్ మురళీ కిశోర్ గతంలో 'వినరో భాగ్యము విష్ణుకథ' లాంటి ఒక మోస్తరు విజయాన్ని అందుకున్నాడు, కాబట్టి ఈ భారీ మాస్ ఎమోషనల్ డ్రామాను అతను ఎంతవరకు గ్రిప్పింగ్‌గా హ్యాండిల్ చేశాడనేది ముఖ్యం. కథలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్, సెంటిమెంట్ సరిగ్గా పండకపోతే కేవలం యాక్షన్ సీన్లు మాత్రమే సినిమాని  రక్షించలేవు. బాక్సాఫీస్ విశ్లేషణ ప్రకారం, జులై రెండో వారంలో పెద్ద సినిమాల పోటీ ఏదీ లేకపోవడం లెనిన్‌కు కలిసివచ్చే అంశం. ఒకవేళ మొదటి రోజు పాజిటివ్ టాక్ వస్తే, బి అండ్ సి సెంటర్లలో కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. మొత్తానికి అఖిల్ పదేళ్ల నిరీక్షణకు ఈ 'లెనిన్' చిత్రం తెరదించి, అతనికి మొదటి కమర్షియల్ సక్సెస్ అందిస్తుందని ట్రేడ్ వర్గాలు బలంగా ఆశిస్తున్నాయి. అభిమానులు కూడా అయ్యగారు  ఈ సారి బ్లాక్ బస్టర్ అందుకుంటాడనే నమ్మకంతో ఉన్నారు. 



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com