Home

»

Latest News

Yetta Yetta Song: ‘లెనిన్‌’ నుంచి ‘ఎట్టా ఎట్టా’ సాంగ్ రిలీజ్‌.. అఖిల్-భాగ్యశ్రీ కెమిస్ట్రీ అదిరింది!

Apr 16, 2026

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ (Lenin) శరవేగంగా రూపొందుతోంది. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవ‌ల విడుద‌లైన ఫస్ట్ సాంగ్ ‘వారేవా వారేవా’కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా ‘ఎట్టా ఎట్టా..’ అనే సాంగ్ విడుద‌లైంది. 

‘ఎట్టా ఎట్టా’ సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. జోష్‌తో నిండిన ఈ డాన్స్ మెలోడీ క్యాచీ బీట్స్, ఎనర్జీతో మెప్పిస్తోంది. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు హైలైట్. అఖిల్ తన మాస్ స్టెప్స్‌తో అదరగొడుతుంటే, భాగ్యశ్రీ తన చార్మ్‌తో స్క్రీన్‌పై మెప్పిస్తోంది. వీరిద్దరి జోడీ స్క్రీన్ మీద చాలా ఫ్రెష్‌గా కనిపిస్తోంది.

త‌న‌దైన సిగ్నేచ‌ర్ హుక్స్‌, బీట్స్‌తో  మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ మాస్ మెలోడీని అద్భుతంగా కంపోజ్ చేశారు. సింగ‌ర్ శ్రీకృష్ణ‌తో క‌లిసి త‌మ‌న్ ఈ పాట‌ను పాడ‌టం విశేషం. భాస్క‌ర‌భ‌ట్ల ట్యూన్‌కు త‌గ్గ‌ట్టు క్యాచీ లిరిక్స్ అందించారు. ప్ర‌తీ ప‌దం వినసొంపుగా లోక‌ల్ ట‌చ్‌తో రొమాంటిక్ స్టైల్లో ఉన్న‌ట్లు అనిపిస్తోంది. 

వీడియో సాంగ్‌లో కనిపించే లోకేషన్లు, సినిమాటోగ్రఫీ టాప్ నాచ్‌గా ఉన్నాయి. కలర్ గ్రేడింగ్, సెట్స్ సినిమా మేకింగ్ వాల్యూస్‌ను ప్రతిబింబిస్తున్నాయి. అఖిల్ డాన్స్ మూమెంట్స్ కూడా చాలా గ్రేస్‌ఫుల్‌గా ఉన్నాయి. ఈ సాంగ్ విజువల్స్ చూస్తుంటే, సినిమాలో ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉండబోతుందని అర్థమవుతోంది.

‘లెనిన్’ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే కథతో పూర్తి ఎంటటైన‌ర్‌గా రూపుదిద్దుకుంటోంది. అంద‌రూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న‌ ఈ చిత్రం జూన్ 26న థియేటర్లలో విడుదల కానుంది. ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా మేక‌ర్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 

అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com