Home

»

Latest News

అక్కినేని అంటే ఆ అరగంట చెప్పేసిందా! లెనిన్ విజయంపై ఆసక్తికర వ్యాఖ్యలు 

Jul 16, 2026 12:15PM

 


అభిమానుల టెన్షన్ ని ఆమడ దూరం పారద్రోలుతూ లెనిన్(Lenin)తో అఖిల్(Akhil)అదిరిపోయే హిట్ అందుకున్నాడు. మాములు హిట్ కూడా కాదు, కెరీర్ లోనే బిగెస్ట్ బ్లాక్ బస్టర్. దీంతో అక్కినేని అభిమానులుకాలర్ ఎగరేస్తుండంతో పాటు ఇక నుంచి తెలుగు చిత్ర సీమలో అక్కినేని అఖిల్ హవా స్టార్ట్ అయిందని సోషల్ మీడియా వేదికగా హంగామా సృష్టిస్తున్నారు.

ఇక నిన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని గుంటూరు లో లెనిన్ విజయోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు లెనిన్ గురించి మాట్లాడుతు మూవీ మొత్తం ఒక ఎత్తయితే, చివరి అరగంట మూవీ మొత్తం ఒక ఎత్తు. అఖిల్ తన పెర్ ఫార్మెన్స్ తో అక్కినేని అంటేనే నటన, నటన అంటేనే అక్కినేని అని మరో సారి నిరూపించాడని చెప్పుకొచ్చారు.  ఇప్పుడు ఈ మాటలు తెలుగు సినిమా ప్రేక్షకులని కూడా ఆకట్టుకుంటున్నాయి.


Also read: ఆ స్టార్ హీరోకి ఇచ్చిన రెమ్యునరేషన్ ఒక్క రూపాయినే.. బయటపడ్డ అసలు నిజం 
     

మురళీ కిషోర్ అబ్బురి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించడమే కాకుండా, అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచి సరికొత్త రికార్డుని నెలకొల్పడంతో పాటు వంద కోట్లకి దగ్గరలో ఉంది. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే జత కట్టగా శివాజీ, బ్రహ్మాజీ, ఈశ్వరీ రావు కీలక పాత్రల్లో మెరిశారు.థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నాగార్జున, నాగ వంశీ ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లెనిన్ ని మరో స్థాయిలో నిలబెట్టాయి. 

akhil, lenin, bhaghyashri borse, murali krishna abburu, nagarjuna

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com