Home

»

Latest News

నాతో అసలు పని లేదు.. అయినా సరే ఆ దర్శకుడు డబ్బులు తిరిగిచ్చేశారు!

Sep 26, 2026 6:11PM


విజయవాడ అమ్మాయి 'లయ' తెలుగు ప్రేక్షకులు ఎనీ టైం గుర్తుంచుకునేలా ప్రాముఖ్యత గల సినిమాలే చేసి మెప్పించింది. తన పెర్ఫార్మ్ చూస్తుంటే  అప్పుడే విరబూసిన లేలేత  గులాబీ పువ్వు మనతో ఏదో చెప్పాలనుకున్నంత అందంగా ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది.

లయ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ఒక సినిమాకి సంబంధించి  కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల, లేక ఇతర కారణాల వల్ల నాకు ఇవ్వాల్సిన పారితోషికం కొద్ది భాగం పెండింగ్‌లో ఉండిపోయింది. సాధారణంగా నాలుగేళ్లు గడిచిపోయాక,  పెళ్లి చేసుకుని పరిశ్రమకు దూరమవుతున్న సమయంలో ఇక ఆ బాకీ తిరిగి వస్తుందని నేను  ఊహించలేదు.2006లో నా  వివాహ మహోత్సవం ఎంతో వేడుకగా జరిగింది.వేడుక ముగిసిన తర్వాత ఒక ప్రత్యేక పార్సిల్ నా ఇంటికి వచ్చింది. దాన్ని ఏదో సాధారణ వివాహ బహుమతి అనుకుని ఓపెన్ చేసి షాక్ అయ్యాను. ఆ కవరులో పెద్ద మొత్తంలో నగదుతో పాటు ఒక భావోద్వేగపూరితమైన లేఖ ఉంది.   ఆ లేఖలో 'అమ్మా లయా, నేను నీకు  ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ బాకీ ఇది. ఆ సమయంలో పరిస్థితుల వల్ల నీకు పూర్తి పారితోషికం ఇవ్వలేకపోయాను. ఇప్పుడు నీ పెళ్లి సమయానికి నా దగ్గర డబ్బులు సరిపడా ఉన్నాయి. అందుకే ఈ బకాయిని నీకు అందజేస్తున్నాను. దీన్ని నా పెళ్లి కానుకగా, ఆశీర్వాదంగా భావించి స్వీకరించు" అని పేర్కొన్నారు.   ఈ సంఘటనతో తనకు మాటలు రాలేదని లయ చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: అనుమాన పక్షి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్లు: మరి డిజాస్టర్ అన్నారుగా!

 

 

 "నేను ఆ డబ్బులను ఎప్పుడో వదిలేసుకున్నాను. 2004లో జరిగిన సినిమాకు 2006లో పెళ్లి చేసుకుని వేరే దేశం వెళ్లిపోతున్న నాకు ఆ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం  లేదు. ఇకపై నాతో ఆయనకు ఎటువంటి పని కూడా లేదు. అయినా సరే, నీతిగా తన బాధ్యతను గుర్తుపెట్టుకుని, ఒక తండ్రిలా భావించి ఆ పారితోషికాన్ని పెళ్లి కానుకగా పంపడం ఆయన గొప్పతనానికి నిదర్శనం" అంటూ చెప్పుకొచ్చింది. ఆ దర్శకుడు  కళాతపస్వి కె. విశ్వనాథ్ అనే పేరు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. 2004వ లో విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన 'స్వరాభిషేకం' అనే చిత్రంలో లయ హీరోయిన్.

 

[Laya Recalls Remuneration Wedding Gift From Director, Actress Laya, Director K Viswanath,Swarabhishekam Movie, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com